Rashmika – Puhspa 2 : పుష్ప 2 సాంగ్ పై రష్మిక కామెంట్స్.. ఆ డ్యాన్స్ వేయడానికి చాలా గంటలు పట్టింది..

తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ కి రష్మిక గెస్ట్ గా రావడంతో ఈ ఎపిసోడ్ లో రష్మిక పుష్ప 2 గురించి మాట్లాడింది.

Rashmika Mandanna Interesting Comments on Pushpa 2

Rashmika Mandanna – Puhspa 2 : సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి రెండు పాటలు, గ్లింప్స్ రిలీజవ్వగా వీటితో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే సినిమా ఆగస్టు నుంచి డిసెంబర్ కి వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంకా పుష్ప 2 షూటింగ్ జరుగుతూనే ఉంది. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6 విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 1లో రష్మిక తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. సాంగ్స్ లో కూడా ఆడియన్స్ లతో మెప్పించింది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ కి రష్మిక గెస్ట్ గా రావడంతో ఈ ఎపిసోడ్ వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో రష్మిక పుష్ప 2 గురించి మాట్లాడింది.

Also Read : Pawan Kalyan – Narne Nithiin : పిఠాపురంలో మొదటి సినిమా ఈవెంట్ ఇదే.. పవన్ కళ్యాణ్ అడ్డాలో ఎన్టీఆర్ బామ్మర్ది..

రష్మిక మందన్నా పుష్ప 2 గురించి మాట్లాడుతూ.. ఒక సాంగ్ లో బాగా కష్టపడ్డాను. కెమెరా లెన్స్ దగ్గర హ్యాండ్ మూమెంట్స్ తో వేసే స్టెప్స్ కోసం చాలా కష్టపడ్డాను. ఆ స్టెప్స్ వేయడానికి చాలా గంటలు పట్టింది. చాలా టేక్స్ తీసుకున్నాను. ఆ పాట మొత్తం కూడా బాగుంటుంది. సుకుమార్ గారు చాలా పర్ఫెక్ట్ గా ప్రతి సీన్ చూసుకుంటున్నారు. పుష్ప 1 కంటే పుష్ప 2 చాలా పెద్ద సినిమా అవుతుంది అని తెలిపింది. దీంతో రష్మిక వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఆ సాంగ్ ఏంటి? రష్మికనే డ్యాన్స్ ఉందని చెప్తుందంటే బన్నీ డ్యాన్స్ కూడా ఆ పాటలో అదిరిపోయి ఉంటుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు