Pawan Kalyan – Narne Nithiin : పిఠాపురంలో మొదటి సినిమా ఈవెంట్ ఇదే.. పవన్ కళ్యాణ్ అడ్డాలో ఎన్టీఆర్ బామ్మర్ది..
పిఠాపురంలో మొదట జరగబోయే సినిమా ఈవెంట్ ని ప్రకటించారు.

NTR Cousin Narne Nithiin Movie Event in Pawan Kalyan Pithapuram
Pawan Kalyan – Narne Nithiin : పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా వాళ్ళు కూడా పిఠాపురం వైపే చూస్తున్నారు. పవన్ గెలిచాక పిఠాపురంలో శర్వానంద్ మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు పర్మిషన్స్ రాకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇప్పటివరకు ఏ ఈవెంట్ జరగకపోయినా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పిఠాపురం వెళ్లి సందడి చేసి వచ్చారు.
నిన్నే నిహారిక కూడా తన కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రమోషన్ లో భాగంగా పిఠాపురం వెళ్లి వచ్చింది. ఇప్పుడు పిఠాపురంలో మొదట జరగబోయే సినిమా ఈవెంట్ ని ప్రకటించారు. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా వస్తున్న ఆయ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పిఠాపురంలో నిర్వహించనున్నారు. పిఠాపురంలోని సత్యకృష్ణ కన్వెన్షన్ లో ఆయ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. దీంతో పిఠాపురం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Filmfare Awards : 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. టాలీవుడ్ విన్నర్స్ వీళ్ళే.. దుమ్ములేపిన దసరా, బేబీ..
ఈ ఈవెంట్ కి నార్నె నితిన్ తో పాటు హీరోయిన్, మూవీ టీమ్ అంతా హాజరవుతుండగా అల్లు అరవింద్ కూడా రావొచ్చని సమాచారం. పిఠాపురంలో మొదటిసారి అధికారికంగా జరిగే సినిమా ఈవెంట్ ఎన్టీఆర్ బామర్దిది కావడంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు పవన్ ఫ్యాన్స్, పిఠాపురం ప్రజలు ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపై పిఠాపురంలో రెగ్యులర్ గా ఈవెంట్స్ జరిగే అవకాశాలు బానే ఉన్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం ఫేమస్ అయిపోతుంది.
Ultimate Fun Entertainer of the Season #AAY THEATRICAL TRAILER launch at SatyaKrishna Convention, Pithapuram, Gollaprolu??
???? ??? ???? Loading on August 5th from 11AM Onwards?#AAYPremiersonAUG15 #AAYMovie#AlluAravind #BunnyVas #VidyaKoppineedi @NarneNithiin… pic.twitter.com/gsv1BuCvga
— Geetha Arts (@GeethaArts) August 3, 2024