Rashmika Mandanna : గాయంతో ఇంట్లో కూర్చున్న రష్మిక.. అయినా కొత్త సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..
తాజాగా రష్మిక తన మైసా సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించింది. (Rashmika Mandanna)
- Saketh U
- Published on- September 1, 2026 / 02:25 PM IST
Rashmika Mandanna
Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆమెకు ఆరు వారాల విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ప్రస్తుతం ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది. అయితే రష్మికకు గాయం అవ్వడంతో ఆమె ఫిమేల్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న మైసా సినిమా విడుదల ఆలస్యం అవుతుంది అని అంతా అనుకున్నారు.
కానీ తాజాగా రష్మిక తన మైసా సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించింది. కేరళ బ్యాక్ డ్రాప్ గిరిజనుల కథాంశంతో యాక్షన్ సినిమాగా మైసా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రష్మిక అదిరిపోయే యాక్షన్ చేసింది అని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. రవీంద్ర పుల్లే అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.
Also See : Jhansi Rathod : పెళ్లి చేసుకున్న ‘జగద్ధాత్రి’ సీరియల్ నటి ఝాన్సీ రాథోడ్.. ఫోటోలు వైరల్..
తాజాగా మైసా సినిమా నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు రష్మిక ప్రకటించింది. రష్మికకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండగా రష్మిక కోలుకోగానే అది ఫినిష్ చేయడానికి మూవీ యూనిట్ రెడీగా ఉంది. ఇటీవలే విజయ్, రష్మిక జంటగా తెరకెక్కుతున్న రణబాలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. నెల రోజుల గ్యాప్ తో రష్మిక రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.
MYSAA!
The rage! The pain! The heartache! The grief! The grit! The courage! The power and the storm you don’t anticipate coming – That’s Mysaa! 🔥
In cinemas worldwide on 27.11.26!❤️@RawindraPulle @jakes_bejoy @unformulafilms @TSeries @tseriessouth pic.twitter.com/aaDqspvHE7
— Rashmika Mandanna (@iamRashmika) September 1, 2026
