Tollywood : టైర్-1 హీరో రేంజ్.. టాలీవుడ్లో ఇంకో వార్.!
Tollywood : ఒక సినిమా భారీ హిట్ అయితే చాలు.. వెంటనే తమ మార్కెట్ మారిపోయిందని, ఇక తమను టైర్-2 హీరోల జాబితాలో పెట్టొద్దన్న వాదనను తెరపైకి తెస్తున్నారట కొందరు హీరోలు.
Gossip Garage Heros race in Tollywood
Tollywood : ఒక సినిమా భారీ హిట్ అయితే చాలు.. వెంటనే తమ మార్కెట్ మారిపోయిందని, ఇక తమను టైర్-2 హీరోల జాబితాలో పెట్టొద్దన్న వాదనను తెరపైకి తెస్తున్నారట కొందరు హీరోలు. కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ అవ్వడంతో ఆయా హీరోల మార్కెట్, రెమ్యునరేషన్, బిజినెస్ లెక్కలు కూడా మారుతున్నాయట.
దాంతో ఒక్క హిట్‌తోనే టైర్ మారిపోయిందా.? అంటూ మరో వర్గం ప్రశ్నలు వేస్తోందట. హీరోకు ఉన్న స్టార్ ఇమేజ్‌తో పాటు ఓపెనింగ్స్, థియేట్రికల్ బిజినెస్, నాన్-థియేట్రికల్ మార్కెట్, వరుస విజయాలు..ఇలా చాలా అంశాలను లెక్కలోకి తీసుకున్న తర్వాతే టైర్ వన్నా, టైర్ టూనా అనేది నిర్ణయించాలి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందట.
Namrata Shirodkar : మహేశ్ బాబు భార్య.. నమ్రతా లేటెస్టు ఫోటోలు..
ఇక అసలు లొల్లి హీరోల మధ్య కంటే.. వారి అభిమానుల మధ్యే ఎక్కువగా కనిపిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ హీరో ఒక్క సినిమా హిట్ కొట్టగానే సోషల్ మీడియాలో ఇక అతనే టాప్ స్టార్, టైర్-1లోకి ఎంట్రీ అంటూ ప్రచారం మొదలుపెడుతున్నారట. దానికి మరో హీరో అభిమానులు కూడా కౌంటర్లు ఇవ్వడంతో టైర్-1, టైర్-2 చర్చలు మరింత వేడెక్కుతున్నాయట.
అయితే ఇండస్ట్రీలో మాత్రం ఒక్క సినిమా ఫలితంతో వచ్చే ఇమేజ్ ఎంతకాలం నిలుస్తుందనేదే అసలు కొలమానం అంటున్నారట. ఒక హిట్ తర్వాత మరో సినిమా కూడా అదే స్థాయిలో బిజినెస్, ఓపెనింగ్స్, ప్రేక్షకుల క్రేజ్ తెచ్చుకుంటేనే ఆ హీరో మార్కెట్లో వచ్చిన మార్పు స్థిరపడుతుందన్న చర్చ జరుగుతోందట. దీంతో రాబోయే సినిమాల ఫలితాలే కొంతమంది హీరోల టైర్ పొజిషన్‌పై క్లారిటీ ఇవ్వబోతున్నాయనే టాక్ నడుస్తోంది.
