×
Ad

Vijay-Rashmika: నువ్వు గర్వపడతావ్.. విజయ్ పై ప్రేమ వర్షం కురిపించిన రష్మిక..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Vijay-Rashmika) తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు.

Rashmika Mandanna replied to Vijay Deverakonda post on X account

Vijay-Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. అను ఇమ్మాన్యుయేల్ మరో కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో రావ్ రమేష్ రావ్ ఇంపార్టెంట్ పాత్రలో నటించాడు. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా నేడు(నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి కూడా(Vijay-Rashmika) ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల వేల మూవీ టీం కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

Gouri Kishan: నా బరువు గురించి మీకు అవసరమా.. ఏం అడుగుతున్నారు మీరు.. రిపోర్టర్ పై సీరియస్ అయిన గౌరి

నాకు తెలుసు వాళ్ళు ఏదో శక్తివంతమైన, ముఖ్యమైన, నమ్మడానికి కష్టంగా అనిపించే సినిమా చేశారని. అందరు నటుల పెర్ఫార్మెన్స్ అత్యున్నత స్థాయిలో ఉంటుందని నమ్ముతున్నాను. అది ఆడియన్స్ పై మంచి ప్రభావం చూపబోతోందని అనుకుంటున్నాను. రేపు మనమందరం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఇది జరగడం చూస్తాము. అందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడండి” అంటూ రాసుకోచ్చాడు. దీనికి లవ్ ఎమోజీస్ కూడా యాడ్ చేశాడు విజయ్ దేవరకొండ.

ఇక విజయ్ చేసిన ఈ పోస్ట్ కి రష్మిక కూడా రిప్లై ఇచింది.. “అవును ఇది శక్తివంతమైనది, ముఖ్యమైనది,నమ్మడానికి కష్టంగా ఉండేది. మీరు చాలా బాగా చెప్పారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఇది చాలా కాలం పాటు గుర్తుంటుంది. ముందు నుంచే ఈ సినిమాలో మీరు పరోక్షంగా భాగమయ్యారు. నా విషయంలో మీరు గర్వపడతారు”అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ లో లెక్కలేనన్ని లవ్ ఈమోజీలను పెట్టింది రష్మిక. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గా విజయ్-రష్మికల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.