Gouri Kishan: నా బరువు గురించి మీకు అవసరమా.. ఏం అడుగుతున్నారు మీరు.. రిపోర్టర్ పై సీరియస్ అయిన గౌరి

ఈ మధ్య చాలా మంది రిపోర్టర్స్ సందర్భానికి అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ వైరల్ అవుతున్నారు. (Gouri Kishan)తాజాగా ఇదే సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. కానీ, ఈసారి చెన్నై లో జరిగింది.

Gouri Kishan: నా బరువు గురించి మీకు అవసరమా.. ఏం అడుగుతున్నారు మీరు.. రిపోర్టర్ పై సీరియస్ అయిన గౌరి

Actress Gauri Kishan gets serious about reporter asking about her weight

Updated On : November 7, 2025 / 9:54 AM IST

Gouri Kishan: ఈ మధ్య చాలా మంది రిపోర్టర్స్ సందర్భానికి అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ వైరల్ అవుతున్నారు. తాజాగా ఇదే సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. కానీ, ఈసారి చెన్నై లో జరిగింది. 96 సినిమాతో సూపర్ ఫేమ్ సంపాదించుకున్న నటి గౌరీ కిషన్. ఈ అమ్మడు నటిస్తున్న(Gouri Kishan) లేటెస్ట్ మూవీ అదర్స్. దర్శకుడు అబిన్ హరికరణ్ తెరకెక్కుస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో గౌరీ కిషన్ కూడా పాల్గొంది.

SSMB29: ఈవెంట్ కి ముందు సూపర్ సర్ ప్రైజ్.. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ఇవాళే.. ఏ టైంకి అంటే?

ఈ కార్యక్రమంలో ఒక రిపోర్టర్ గౌరీని “ఎత్తుకుంటే మీరు ఎంత బరువు ఉంటారు” అని అడిగాడు. దానికి ఒక్కసారిగా సీరియస్ అయింది గౌరీ..”నా బరువు గురించి నీకు ఎందుకు. తెలుసుకుని ఏం చేస్తావు? ఇది శారీరకంగా అవమానించడమే. నేను చేసిన సినిమా గురించి అడగండి. ఇది నా ఇమేజ్ ని ఎగతాళి చేయడం అవుతుంది” అంటూ ఘాటుగా స్పందించింది గౌరీ. దాంతో మరోసారి మైక్ అందుకున్న ఆ రిపోర్టర్.. నేను మళ్ళీ అదే అడుగుతున్నాను. తప్పుగా ఏమీ అడగలేదు. మోడీ గురించి మిమ్మల్ని అడగవచ్చా? ఖుష్బు, సరిత లాంటి వారికి కూడా ఈ ప్రశ్న ఎదురయ్యింది. అదే నేను అడిగాను అన్నాడు.

దానికి మండిపోయిన గౌరీ.. నేను ఒక సినిమా చేశాను. దాని గురించి అడగండి. అంతేగానీ, నా బరువు గురించి అడగడం నాకు నచ్చలేదు. సినిమా గురించి కాకుండా నా బరువు గురించి తెలుసుకోవడం అంత ముఖ్యమా ? ఇంతమందిలో నేను ఒక్కదాన్నే మహిళను. ఒకరకంగా మీరు బాడీ షేమింగ్‌ చేస్తున్నారు. ఇది కరక్ట్ కాదు. మీరు మీ వృత్తికి అవమానిస్తున్నారు” అంటూ మరోసారి సీరియస్ అయ్యింది నటి. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.