Rashmika Mandanna: రష్మిక ఖాతాలో మరో అరుదైన ఘనత.. జపాన్ వేదికగా మెరవనున్న ‘నేషనల్ క్రష్’
క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకలో వరుసగా రెండోసారి సందడి చేయనున్న రష్మిక మందన్న(Rashmika).
- V Santhosh Kumar
- Updated on- April 4, 2026 / 12:32 PM IST
Rashmika mandanna second appearance at the Crunchyroll Anime Awards ceremony
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకున్నారు. జపాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘క్రంచీరోల్ యానిమే అవార్డుల’ వేడుకలో వరుసగా రెండోసారి ప్రెజెంటర్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. గతంలో 2024లో ఈ వేదికపై మెరిసిన రష్మిక, రెండుసార్లు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేసింది.
Vijay Thalapathy: టార్గెట్ విజయ్.. ఆయనకు వ్యతిరేకంగా ‘TN 2026’ మూవీ
యానిమేటెడ్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ఈ పురస్కారాల 10వ ఎడిషన్ వేడుక మే 23న టోక్యోలో ఘనంగా జరగనుంది. ఈ సందర్బంగా హాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఆమె విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి పాత్రతో రష్మిక(Rashmika Mandanna)కు జపాన్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. అభిమానులను సైతం సంపాదించుకున్నారు రష్మిక. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె మైసా, రణబాలి సినిమాలు చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
