×
Ad

Rashmika Mandanna : చివరి ప్రేమే ప్యూర్ గా ఉంటుంది.. అమ్మాయిలు కూడా బాధపడతారు.. నేను మంచి గర్ల్ ఫ్రెండ్ ని.. రష్మిక వ్యాఖ్యలు వైరల్..

ఈ ఇంటర్వ్యూలో అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది రష్మిక. ఈ క్రమంలో ప్రేమ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. (Rashmika Mandanna)

Rashmika Mandanna

Rashmika Mandanna : రష్మిక మందన్న తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పది రోజుల గ్యాప్ లో రష్మిక రెండు సినిమాలు రిలీజ్ చేయబోతుంది. అక్టోబర్ 21న హిందీ థామా సినిమాతో రాబోతుండగా నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో రాబోతుంది. రెండు సినిమాల ప్రమోషన్స్ తో బిజీగా ఉంది రష్మిక.(Rashmika Mandanna)

తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది రష్మిక. ఈ క్రమంలో ప్రేమ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Also Read : Raviteja : స్టార్ హీరో సినిమాకు పనిచేస్తున్న రవితేజ తనయుడు.. హీరో అవుతాడనుకుంటే ఇలా.. కూతురు ఏమో అలా..

ఈ ఇంటర్వ్యూలో.. ఫస్ట్ లవ్ ప్యూర్ అంటారు అది నిజమేనా అని అడగ్గా రష్మిక మొదటి ప్రేమ ప్యూర్ కాదు చివరి ప్రేమ ప్యూర్ గా ఉంటుంది అని తెలిపింది. అలాగే ఒక పర్సన్ మీద చాలా విషయాల్లో లవ్ ఫీల్ అవుతాం. లవ్ లో జెలసీ ఉండదు అని చెప్పింది.

లవ్ బ్రేకప్ అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలే తొందరగా మూవ్ ఆన్ అవుతారు అది నిజమేనా అని అడగ్గా రష్మిక.. అందరూ అదే అంటారు. ఎలా? ఎందుకు? అమ్మాయిలు లోపల బాధపడతారు. అబ్బాయిలు బయటకు చూపిస్తారు. జనాలు అబ్బాయిలు ఎక్కువ బాధపడతారు అని చెప్తారు. కానీ అమ్మాయిలు కూడా బాధపడతారు అని తెలిపింది. అలాగే ఇదే ఇంటర్వ్యూలో మీరు సింగిలా అని అడిగితే.. నేను ప్రస్తుతం మంచి గర్ల్ ఫ్రెండ్ ని అని తెలిపింది రష్మిక.

Also Read : Ram Pothineni : క్యాస్ట్ గొడవల్లో మొత్తం ఆస్తి పోగొట్టుకున్న రామ్ ఫ్యామిలీ.. దాంతో ఊరు వదిలేసి..

గత కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని వార్తలు రాగా ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారని తెలిసింది. దీంతో ఈ ఇంటర్వ్యూలో విజయ్ ని ఉద్దేశించి లాస్ట్ లవ్ ప్యూర్ ఉంటుందని, రక్షిత్ శెట్టి తో బ్రేకప్ తర్వాత బాధపడినట్టు ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇలా ప్రేమపై రష్మిక కామెంట్స్ వైరల్ గా మారాయి.