Raviteja : స్టార్ హీరో సినిమాకు పనిచేస్తున్న రవితేజ తనయుడు.. హీరో అవుతాడనుకుంటే ఇలా.. కూతురు ఏమో అలా..
ఈ క్రమంలో రవితేజ కూతురు, కొడుకు ప్రస్తావన కూడా వచ్చింది.(Raviteja)

Raviteja
Raviteja : మాస్ మహారాజ రవితేజ త్వరలో మాస్ జాతర అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు రవితేజ. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో రవితేజ కూతురు, కొడుకు ప్రస్తావన కూడా వచ్చింది.(Raviteja)
రవితేజ కొడుకు మహాధన్ గతంలో రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించాడు. దీంతో మహాధన్ కూడా హీరో అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి.. రవితేజ కొడుకు మహాధన్ నేను సూర్య గారితో చేస్తున్న సినిమాకు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు అని తెలిపాడు. అతను చిన్నప్పట్నుంచి సినిమా సెట్స్ లోనే పెరిగాడు కాబట్టి అతనితో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. చాలా న్యాచురల్ గా పనిచేసుకుంటూ వెళ్తున్నాడు అని అన్నాడు.
Also Read : Prabhas Hanu : ప్రభాస్ – హను సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్, అప్డేట్ వచ్చేసింది.. దీపావళి స్పెషల్..
దీంతో హీరో అవుతాడు అనుకుంటే మహాధన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారు. మరి మహాధన్ భవిష్యత్తులో హీరో అవుతాడా? దర్శకుడు అవుతాడా చూడాలి. ఇక మహాధన్ పెద్దయ్యాక తన ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నాడు.
రవితేజ తన కూతురు గురించి మాట్లాడుతూ.. మోక్షద తన తమ్ముడుని చూసుకుంటుంది. కెరీర్ గురించి తను చెప్తుంది అని అన్నారు. రవితేజ కూతురు మోక్షద కూడా సినీ పరిశ్రమలోనే పనిచేస్తుంది. మోక్షద ఓ పక్క రవితేజ థియేటర్ ART సినిమాస్ బాధ్యతలు చూసుకుంటూనే మరో పక్క ఓ సినిమాకు ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంది. భవిష్యత్తులో మోక్షద.. రవితేజ పేరుమీద ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు తీస్తుందని సమాచారం. మొత్తానికి రవితేజ పిల్లలు ఇద్దరూ ఏం చేసినా సినీ పరిశ్రమలోనే అని ఫిక్స్ అయిపోయారు.
Also Read : Ram Pothineni : క్యాస్ట్ గొడవల్లో మొత్తం ఆస్తి పోగొట్టుకున్న రామ్ ఫ్యామిలీ.. దాంతో ఊరు వదిలేసి..