Rashmika Vijay : పెళ్లి తర్వాత విజయ్ – రష్మిక ఫస్ట్ యాడ్ చూశారా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ..
మీరు కూడా విజయ్ - రష్మిక పెళ్లి తర్వాత మొదటి యాడ్ వీడియోని చూసేయండి.. (Rashmika Vijay)
- Saketh U
- Published On : March 1, 2026 / 04:18 PM IST
Rashmika Vijay
- రష్మిక – విజయ్ పెళ్లి
- పెళ్లి తర్వాత మొదటి యాడ్
- విజయ్ రష్మిక కొత్త యాడ్ వైరల్
Rashmika Vijay : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల ఫిబ్రవరి 26న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో మార్చ్ 4న హైదరాబాద్ లో రిసెప్షన్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం విజయ్ – రష్మిక పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.
పెళ్లి తర్వాత మొదటిసారి విజయ్ – రష్మిక కలిసి నటించిన ప్రకటనను రిలీజ్ చేసారు. మాన్యవర్ అనే వెడ్డింగ్ క్లాత్ బ్రాండ్ కి వీరిద్దరూ కలిసి ఒక యాడ్ చేసారు. ఇది పెళ్ళికి ముందే షూట్ చేసి ఇప్పుడు పెళ్లి తర్వాత రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. పెళ్లితో నేషనల్ వైడ్ విజయ్ – రష్మికకు మరింత ఫేమ్ వచ్చింది.
Also Read : Jason Sanjay : విజయ్ కి సపోర్ట్ ఇవ్వని కొడుకు.. సంజయ్ పై ఫ్యాన్స్ విమర్శలు..
ఆ ఫేమ్ ని మొదట మాన్యవర్ వాడుకొని ఇలా యాడ్ చేసింది. ఈ యాడ్ కోసం ఇద్దరికీ భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పెళ్ళి బ్యాక్ డ్రాప్ లో ఓ సాంగ్ తో ఈ యాడ్ సాగింది. ఈ యాడ్ లో ఇద్దరూ సరదాగా గొడవపడి మళ్ళీ కలిసి పెళ్లి చేసుకొని డ్యాన్స్ చేసినట్టు చూపించారు. పెళ్లి తర్వాత వీరిద్దరి ఫస్ట్ యాడ్ రావడంతో ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు.
మీరు కూడా విజయ్ – రష్మిక పెళ్లి తర్వాత మొదటి యాడ్ వీడియోని చూసేయండి..
Also Read : Roja : మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రోజా.. టీజర్ మాములుగా లేదుగా..
