Rashtriya Vanarasena Sangam files complaint against director Rajamouli
Rajamouli: దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు అయ్యింది. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో ఆయన హిందువుల(Rajamouli) ఆరాధ్య దైవమైన హనుమతుడిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు దబ్బతిన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇక దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ రివీలింగ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. “నేను దేవుడిని పెద్దగా నమ్మను కానీ, ఇందాక మా నాన్న వచ్చి మనం ఎం చేసినా హనుమంతుడు వెనుకుంది చూసుకుంటాడు అని చెప్పాడు. నాకు కోపం వచ్చింది. అలాగే, నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయన గురించి చెప్తూనే ఉంటుంది. ఆమె కూడా అన్నీ ఆయనే చూసుకుంటాడు అని చెప్పింది. అప్పుడు కూడా నాకు కోపం వచ్చింది. ఇదేనా చూసుకోవడం” అంటూ వ్యగ్యంగా మాట్లాడారు. దాంతో రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
మీ దగ్గర జరిగిన టెక్నీకల్ ఇష్యూకి హనుమంతుడు ఎం చేస్తాడు. అలాంటి కామెంట్స్ చేయడం అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది బైకాట్ రాజమౌళి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయనపై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరి ఈ వివాదంపై రాజమౌళి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.