Ravi Teja 70 : సుధీర్ వర్మతో మాస్ మహారాజా

రవితేజ 70వ సినిమా సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నారు..

Ravi Teja 70 : సుధీర్ వర్మతో మాస్ మహారాజా

Ravi Teja 70

Updated On : October 31, 2021 / 10:48 AM IST

Ravi Teja 70: మాస్ మహారాజా రవితేజ్ ఈ ఏడాది ‘క్రాక్’ బ్లాక్‌బస్టర్‌‌తో మళ్లీ ట్రాక్‌లోకి రావడంతోనే కాకుండా.. పాండమిక్ తర్వాత టాలీవుడ్‌కి కొత్త శుభారంభాన్నిచ్చారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Puneeth Rajkumar : పునీత్‌కు అభిమాని నివాళి.. వైరల్ అవుతున్న వీడియో..

రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, కొత్త డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్‌లో ‘రామారావు – ఆన్ డ్యూటీ’, త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’ సినిమాలు చేస్తున్నారు. ‘ఖిలాడీ’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పుడు మరో సినిమా అనౌన్స్ చేశారు.

Peddanna : బతికుంటే బాలునే పాడేవారు..

రవితేజ హీరోగా నటిస్తున్న 70వ సినిమా ఇది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. నవంబర్ 5వ తేదీ ఉదయం 10:08 గంటలకు ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యబోతున్నారు.