Ravanasura : రవితేజ 70 ‘రావణాసుర’..

మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ సినిమా ‘రావణాసుర’..

Ravanasura

Ravanasura: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి రావడమే కాకుండా.. పాండమిక్ తర్వాత టాలీవుడ్‌కి కొత్త శుభారంభాన్నిచ్చారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!

రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, కొత్త డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో ‘రామారావు – ఆన్ డ్యూటీ’, త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’ సినిమాలు చేస్తున్నారు. ‘ఖిలాడీ’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవలే సుధీర్ వర్మతో మరో సినిమా అనౌన్స్ చేశారు.

Acharya : అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి ‘నీలాంబరి’..

రవితేజ హీరోగా నటిస్తున్న 70వ సినిమా ఇది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.