Ravi Teja comments on Harish Shankar in Mr Bachchan Pre Release event
Raviteja – Harish Shankar : మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథనాయిక నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
సోమవారం రాత్రి కర్నూల్లో ఈ వేడకను నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రవితేజ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ కష్టపడతారని, కానీ హరీష్ శంకర్ ప్రతి విభాగాన్నీ పక్కాగా పర్యవేక్షిస్తూ శ్రమిస్తుంటాడని అన్నారు. నిర్మాత టి.జి విశ్వప్రసాద్ ఇలానే మూవీ చేస్తూ ఉండాలని, అవి విజయాలు సాధిస్తూనే ఉండాలన్నారు.
Harish Shankar : ఒరేయ్.. ఎక్కువ అరుస్తున్నావ్ నిన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేస్తా.. హరీష్ శంకర్
ఇక మిక్కీ జె.మేయర్ నుంచి ఇలాంటి సంగీతం వస్తుందని తాను ఊహించలేదన్నాడు. నిజంగా తన మ్యూజిక్‌తో అతడు షాకిచ్చాడని అన్నారు. ఆగస్టు 14 సాయంత్రం నుంచే ఈ సినిమా సందడి మొదలవుతోందన్నారు. ఇక హీరోయిన్ భాగశ్రీ అద్భుతంగా నటించిందని కితాబు ఇచ్చారు.
అనంతరం యాంకర్ సుమ మాట్లాడుతుతూ.. దర్శకుడు హరీష్ శంకర్ ను ఇమిటేట్ చేయాలని లేదా అతడికి ఓ టైటిల్ ఇవ్వాలని రవితేజను కోరింది. ది మోస్ట్ ఎనర్జిటిక్ దర్శకుడు అని రవితేజ చెప్పారు. అరుపులు, కేకలు అవన్నీ మామూలే అందరికి అలవాటేనన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక హరీష్ శంకర్, సాయంత్రం 6 తరువాత మరో హరీష్ శంకర్ అంటూ రవితేజ దర్శకుడిని ఆటపట్టించారు. హరీష్ శంకర్ ఉంటే ఆర్టిస్టుల పని ఈజీ అవుతుందని, డ్యాన్స్, ఫైట్ మాస్టర్లతో అందరిని ఉతికి ఆరేస్తాడని అన్నారు.