Tiger Nageswara Rao
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ 71వ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాను ‘దొంగాట’ (2015) ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ వదిలిన పోస్టర్లకు విశేష స్పందన వస్తోంది.
Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!
రవితేజ కెరీర్‌లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుందీ సినిమా. ‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్’ అంటూ పోస్టర్‌లో వెనుక నుండి రవితేజ కాళ్లు మాత్రమే చూపించారు. ఈ సినిమా ఓ వ్యక్తి బయోపిక్. దీంతో అసలెవరీ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే క్యూరియాసిటీ కలుగుతుంది.
Balakrishna : అన్ని రోజులు ఆగుతాడా బాలయ్య..
స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ. అతను స్కెచ్ వేస్తే తిరుగుండదు. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టేలా చోరీలు చేసేవాడు. అతని జీవితం ఆధారంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు.
#TigerNageswaraRao pic.twitter.com/9EFYsS4OWw
— Ravi Teja (@RaviTeja_offl) November 3, 2021