Balakrishna : అన్ని రోజులు ఆగుతాడా బాలయ్య..

చేతికి సర్జరీ తర్వాత బాలయ్య రెస్ట్ తీసుకోవాల్సిందేనని చెప్పారు డాక్టర్లు..

Balakrishna : అన్ని రోజులు ఆగుతాడా బాలయ్య..

Balayya

Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ 60 ప్లస్‌లోనూ తానింకా 16 ఏ నంటూ ఫుల్ స్పీడ్ మీద సినిమాలు చేస్తున్నారు. నటుడిగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బిజీగా ఉండే బాలయ్య ఇప్పుడు ‘ఆహా’ ‘అన్‌స్టాపబుల్’ షో తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.

BalaKrishna: కేర్ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణకి సర్జరీ

Akhanda : ‘అఖండ’ అప్‌డేట్

బోయపాటితో చేస్తున్న హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ కంప్లీట్ చేసేశారు. టాక్ షో చేస్తూనే.. తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చెయ్యబోయే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో బాలయ్య బాగా ఎమోషనల్ అయ్యారు.

Balakrishna – Krish : క్రేజీ కాంబో.. గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా!

Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!

బెంగుళూరు నుండి తిరిగి వచ్చిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.. అక్టోబరు 31వ తేదీన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రఘువీర్‌రెడ్డి, డాక్టర్‌ బి.ఎన్‌.ప్రసాద్‌ల టీమ్ నాలుగు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు.

Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు. బాలకృష్ణ కుడి చేయి ఎత్తడం కూడా కష్టంగా ఉండడం.. విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉన్న కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని, ఆరు వారాలా పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా బాలయ్యకు సూచించామని చెప్పారు డాక్టర్లు.

Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..

సినిమాలు, రాజకీయాలు, సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే బాలయ్య అన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటారా.. లేక తన స్టైల్లో నొప్పిని లెక్క చెయ్యకుండా షూటింగ్‌లో పాల్గొంటారో చూడాలి. బాలయ్య త్వరగా కోలుకోవాలంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!