BalaKrishna: కేర్ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణకి సర్జరీ

నందమూరి నటసింహం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.

BalaKrishna: కేర్ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణకి సర్జరీ

Balakrishna

BalaKrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.. అక్టోబరు 31వ తేదీన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి వెళ్లారు.

ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రఘువీర్‌రెడ్డి, డాక్టర్‌ బి.ఎన్‌.ప్రసాద్‌ల టీమ్ నాలుగు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు. బాలకృష్ణ కుడి చేయి ఎత్తడం కూడా కష్టంగా ఉండడం.. విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉన్న కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని చెప్పారు డాక్టర్లు.

సూర్య – జ్యోతిక కోటి విరాళం

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రస్తుతం బాలయ్య ఆహా ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే‌’ పేరుతో ఓ షో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవల విడుదల చేశారు.