Ravi Teja: ఇక ఆలస్యం లేదు.. రవి తేజ కూడా వచ్చేస్తున్నాడు
రవితేజ (Ravi Teja) కొత్త సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మేకర్స్ సూపర్ ప్లాన్ చేస్తున్నారు.
- V Santhosh Kumar
- Updated on- May 29, 2026 / 02:44 PM IST
Ravi Teja Irumudi movie set to be released in August
- ఆగస్టు రేసులో రవితేజ సినిమా
- తండ్రీకూతుళ్ల ఎమోషనల్ కథతో ‘ఇరుముడి’
- త్వరలోనే రానున్న ఫస్ట్ సింగిల్
Ravi Teja: తెలుగు చిత్ర పరిశ్రమలో రాబోయే జూన్ నెల నుండి సినిమాల సందడి గట్టిగా షురూ కానుంది. ‘పెద్ది’ సినిమాతో మొదలయ్యే ఈ టాలీవుడ్ బాక్సాఫీస్ జోరు ఆ తర్వాత కూడా వరుస విడుదలలతో హోరెత్తనుంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలలను టార్గెట్ చేస్తూ ఇప్పటికే పలు భారీ చిత్రాలు కర్చీఫ్ వేశాయి. వర్షాల సీజన్ అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఆగస్టు నెల సినిమాలకు మంచి అనుకూలమైన సమయం కావడంతో, ఆ నెల రేసులోకి వచ్చే చిత్రాల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.
*Anna Lezhneva: మే నెలలో మధురమైన క్షణాలు.. స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన పవన్ భార్య అన్నా
ఈ క్రమంలోనే ఆగస్టు బాక్సాఫీస్ బరిలో మాస్ మహారాజా రవితేజ(Raviteja) కూడా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ని ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య సాగే సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి, ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తోంది.
