×
Ad

Raviteja: మాస్‌ మహారాజా ట్యాగ్ తీసేయమన్న రవితేజ.. కారణం అదేనా?

రవి తేజ(Raviteja) చేస్తున్న లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Ravi Teja is removing Mass Maharaja tag.

Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయాడు రవి తేజ. అందుకే, ఆయన్ని ఆడియన్స్ ప్రేమగా మాస్ మహారాజ్ అని పిలుచుకుంటారు. ఆయన హీరోగా వచ్చే ప్రతీ సినిమాకు అదే ట్యాగ్ గా ఉంటూ వస్తోంది. అయితే, తాజాగా ఆయన ఆ ట్యాగ్ వద్దని చెప్పాడట రవి తేజ. దీంతో, ఆయన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఆలాగే అయన ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి గురించి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కిశోర్ తిరుమల.

Dimple Hayathi: ఒంపుల హరివిల్లులా డింపుల్ హయతి.. అందాలు చూస్తే పోతుంది మతి.. ఫొటోలు

ఆయన డైరెక్షన్ లో రవి తేజ(Raviteja) చేస్తున్న లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్బంగా దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ..”ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కథను ముందు రవి తేజ గారికే చెప్పాను. కానీ, డేట్స్ అడ్జెస్ట్ మెంట్స్ కాకపోవడం వల్ల వేరే హీరోతో చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయనతో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చేస్తున్నాను.

ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అనిపించింది సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి ఆదరణ వస్తుంది అని. నేను ఎప్పుడు కథ, కథలోని పాత్రను బట్టే ముందుకు తీసుకువెళ్తూ ఉంటాను. అందుకే, ఈ సినిమా వరకు మాస్ మహారాజ్ అనే ట్యాగ్ తీసేద్దాం అని రవి తేజ గారు చెప్పారు. అంటూ చెప్పుకొచ్చాడు కిషోర్ తిరుమల. ఇక ఈ న్యూస్ తెలిసి రవి తేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా కాలంగా హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న రవి తేజకు ఈ సినిమా అయిన విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.