న్యూ ఇయర్ స్పెషల్: క్రాక్ ఫస్ట్ లుక్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ కొత్త సంవత్సరంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇప్పటికే రవితేజ సైన్స్-ఫిక్షన్ డ్రామా ‘డిస్కోరాజా’ సినిమా ఈ నెల 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘క్రాక్’ సినిమా కూడా శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి రవితేజ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ పిక్ లో రవితేజా సోడా బాటిల్ పట్టుకొని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఈ పోస్టర్‌లో రవితేజ బ్యాక్ సైడ్ ఖైదీలు నిలబడి ఉంటారు.
ఇక డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన సినిమా క్రాక్. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌పాత్రల్లో నటిస్తున్నారు.