×
Ad

Mass Jathara OTT: రవితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీకి వస్తున్న మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే..

మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara OTT). లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించాడు.

Ravi Teja Mass Jathara movie streaming on Netflix OTT from November 27th

Mass Jathara OTT: మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర'(Mass Jathara OTT). లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మాత్రం పాజిటీవ్ టాక్ రాలేదు అనే చెప్పాలి. కథ రొటీన్ గా ఉండటం, అంతే రొటీన్ గా కథనం కూడా సాగడంతో ఆడియన్స్ ను ఈ సినిమా మెప్పించలేకపోయింది.

Sivaji: ఇండస్ట్రీలో ఉన్న 5 శాతం మందితోనే నష్టం.. వాళ్ళకే భారీ రెమ్యునరేషన్లు, భారీ లాభాలు.. మిగతా 95 శాతం పరిస్థితి ఏంటి..

కొంతమంది రవి తేజ ఫ్యాన్స్ ఈ సినిమాను ఇష్టపడినా.. ఓవరాల్ గా ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో మాస్ జాతర సినిమా రవి తేజ కెరీర్ లో మరో ప్లాప్ సినిమాగా నిలిచింది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇక మాస్ జాతర సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 27వ తేదీ నుంచి ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్లాప్ టాక్ రావడంతో ఈ సినిమాను చాలా మంది చూడలేదు. కాబట్టి, ఓటీటీలో మాస్ జాతర సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇక రవి తేజ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన సెన్సిటీవ్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమలతో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాతో అయినా రవితేజ హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.