Ravi Teja new movie RT 76 release on sankranti
మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో ఆయన మాస్ జాతర చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే మరో చిత్రాన్ని ప్రకటించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజ కెరీర్‌లో 76 చిత్రంగా రూపుదిద్దుకోనుంది.
ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. గురువారం ఈ చిత్ర పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ ఆసక్తికర పోస్టర్ అబిమానులతో పంచుకుంది.
Thug Life : ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ.. కమల్ హాసన్ – మణిరత్నం కాంబో మెప్పించిందా?
Be seated and fasten your seat belts for MASS MAHARAAJ @RaviTeja_offl‘s Entertaining Ride with #RT76 🔥 🛫
A @DirKishoreOffl‘s bonafide entertainer 💥
Produced by @sudhakarcheruk5 under @SLVCinemasOffl ❤️🔥
In Cinemas Sankranthi 2026 ✈️
Begins with Pooja Ceremony & Muhurtam… pic.twitter.com/I75xIVip4A
— SLV Cinemas (@SLVCinemasOffl) June 5, 2025
ఈ పోస్టర్‌లో ఒక బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో రవితేజ కూర్చోని ఉన్నాడు. ఓ చేతిలో స్పానిష్ నేర్చుకునే బుక్, మరో చేతిలో షాంపైన్ బాటిల్ తో కనిపిస్తున్నాడు. మొత్తంగా ఈ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
చిరు-అనిల్ రావిపూడి మూవీ..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగా 157గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. సాహు గారపాటి, సుస్మిత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించిన సంగతి తెలిసిందే.
Tollywood : రూటు మార్చిన టాలీవుడ్ హీరోయిన్స్ ..
ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి వర్సెస్ రవితేజ మూవీ పోటీపడనున్నాయి. సంక్రాంతి పండగ సమయానికి ఈ రెండు చిత్రాలతో పాటు ఇంకెన్ని మూవీలు పోటీలో ఉంటాయో చూడాల్సిందే.