Tollywood : రూటు మార్చిన టాలీవుడ్ హీరోయిన్స్ ..

ఒక హిట్‌ కొడితే చాలు ఆ హీరోయిన్‌ను వరుసగా మూడు, నాలుగు సినిమాల్లో తీసుకుంటున్నారు.

Tollywood : రూటు మార్చిన టాలీవుడ్ హీరోయిన్స్ ..

Tollywood Heroines New Trend

Updated On : June 5, 2025 / 10:31 AM IST

సక్సెస్.. సినీ ఇండస్ట్రీని శాసించేది ఇదే. ఏ హీరోయిన్‌ యాక్ట్ చేసిన మూవీ హిట్‌ కొడుతుందో..నెక్స్ట్‌ సినిమాలో కూడా అదే హీరోయిన్‌ను తీసుకోవడం కామన్‌ అయిపోయింది. అది సెంటిమెంటో లేక.. ఫ్యాన్స్‌ టేస్ట్‌కు తగ్గట్లుగా హీరోయిన్స్‌ను సెలెక్ట్‌ చేస్తున్నారో, మార్కెట్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారో తెలియదు కానీ.. ఇదో ట్రెండ్ అయిపోయింది.

ఒక హిట్‌ కొడితే చాలు ఆ హీరోయిన్‌ను వరుసగా మూడు, నాలుగు సినిమాల్లో తీసుకుంటున్నారు. దీంతో పలువురు హీరోయిన్స్ సినిమా అవకాశాలు లేక ఫీల్ అవుతున్నారట. ఛాన్స్ కోసం రెమ్యునరేషన్‌ను తగ్గించుకునేందుకు కూడా వెనకాడటం లేదట హీరోయిన్స్. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ముఖ్యంగా హిందీ, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషల నుంచి వచ్చిన భామలు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు.

Thug Life : థ‌గ్ లైఫ్ ట్విట్ట‌ర్ రివ్యూ.. క‌మ‌ల్ హాస‌న్ హిట్ కొట్టాడా?

వరుస సినిమాలు లేక, మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న కొందరు హీరోయిన్స్‌కు ఎదురుచూపులే మిగులుతున్నాయట. కొందరు హీరోయిన్స్ ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట. అవకాశాల కోసం డైరెక్టర్స్, నిర్మాతలకు ఫోన్లు చేసి, మాకు ఛాన్స్ ఇవ్వండి, రెమ్యునరేషన్ మీ ఇష్టం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట.

ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. స్టార్ హీరోయిన్స్ రేట్స్ తెలుసుకుని, అందులో సగానికి సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసేందుకు ఓకే చెప్తున్నట్లు టాక్. టాప్ హీరోయిన్‌ ఒక్కో సినిమాకు 2 కోట్లకు పైగా తీసుకుంటుంటే, కొందరు కొత్త హీరోయిన్స్ లేదా అవకాశాలు తగ్గినవారు 50 లక్షలు లేదా అంతకంటే తక్కువైనా సైన్ చేస్తున్నారట. ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్నవారు, వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం..ఈ ప్లాన్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావాలని చూస్తున్నారని టాక్.