Thug Life : థ‌గ్ లైఫ్ ట్విట్ట‌ర్ రివ్యూ.. క‌మ‌ల్ హాస‌న్ హిట్ కొట్టాడా?

లోక నాయకుడు కమల్ హాసన్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం థ‌గ్ లైఫ్‌.

Thug Life : థ‌గ్ లైఫ్ ట్విట్ట‌ర్ రివ్యూ.. క‌మ‌ల్ హాస‌న్ హిట్ కొట్టాడా?

Thug Life Twitter Review

Updated On : June 5, 2025 / 8:38 AM IST

లోక నాయకుడు కమల్ హాసన్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం థ‌గ్ లైఫ్‌. త్రిష‌, శింబు, అభిరామి, ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించారు.

ఈ చిత్రం నేడు (జూన్ 5న‌) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే అమెరికాలో ప్రీమియ‌ర్ షోలు ప్రారంభం అయ్యాయి. ఇక మ‌న‌దేశంలో షోలు సైతం ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని చూసిన ఆడియెన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ స్పంద‌నను తెలియ‌జేస్తున్నారు.

Rajendra Prasad: ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు ఇకపై.. – రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు

ఈ చిత్రాన్ని చూసిన ఫ్యాన్స్ క‌మ‌ల్ న‌ట‌న అదిరిపోయింద‌ని చెప్పుకొచ్చారు. మ‌ణిర‌త్నం బాగా తీశాడ‌ని అంటున్నారు. ఇక ఏఆర్ రెహ‌మాన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని స‌న్నివేశాల్లో నెక్ట్స్ లెవ‌ల్ అని చెబుతున్నారు. ఇంట‌ర్వెల్‌కు ముందు వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశం చాలా బాగుంద‌ని అంటున్నారు.