Rajendra Prasad: ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు ఇకపై.. – రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు
నా ముందు పెరిగిన వాళ్లు వారందరూ. ఎంతో చనువు ఉంటుంది.

Rajendra Prasad: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తన మాటలతో తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సహ నటులను ఉద్దేశించి ఆయన చేసే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పబ్లిక్ ఈవెంట్స్ లో రాజేంద్ర ప్రసాద్ వాడిన పదజాలం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. గతంలో డేవిడ్ వార్నర్ ను, రీసెంట్ గా కమెడియన్ అలీ గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
సీనియర్ నటుడు, 10 మందికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి.. ఇలా మాట్లాడటం ఏంటి అని అంతా మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఈ క్షణం నుంచి తన చివరి శ్వాస వరకు ఇకపై ఎవరినీ అలా మాట్లాడను, మర్యాద ఇచ్చి మాట్లాడతాను అని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే..
”హానెస్ట్ గా ప్రేమలు పంచుకోవడమే ఉంటుంది. ఆ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే ఇన్ని సంవత్సరాలు యాక్టర్ గా నేను ఎలా ఉంటాను. మనం ఒకరికొకరం ప్రేమలు పంచుకోకపోతే ఎలా.. నేను చాలా హర్ట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడూ కూడా ఎవరినీ సింగులర్ తో పిలవను. డబులే. అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే… సీనియర్ ఎన్టీఆర్ నుంచి. ఆయన చిన్నవారిని కూడా నువ్వు అనే వారు కారు. మీరు అనే వారు.
ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరినీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడూ మాట్లాడను. నేను మాట్లాడిన వారంతా నా ఫ్యామిలీ మెంబర్స్. అలీ వెంటనే నాకు ఫోన్ చేశాడు. నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. వాళ్ల సంగతి వదిలేయ్, నువ్వు మర్చిపో అన్నాడు. నేను ఏమైనా అనుకుంటే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. నేను ఆల్రెడీ స్పందన చెప్పేశాను. ఆయన పెద్దోడు, నాకంటే పెద్దోడు, అన్నయ్య అని చెప్పాడు.
Also Read: అనుష్క ఒక్క పోస్టర్ వల్ల 40 యాక్సిడెంట్ లు.. దెబ్బకు పోలీసులు రంగంలోకి దిగి.. ఈ విషయం తెలుసా?
నా సొంత సినిమాల్లో దగ్గర ఉండి మరీ క్యారెక్టర్లు రాయించుకున్నాడు అలీ. నా ముందు పెరిగిన వాళ్లు వారందరూ. చనువు ఉంటుంది. కృష్ణాలో మరీ ఎక్కువ. ఓవర్ లవ్ అయిపోతే అలా మాట్లాడతాం. మాకు విపరీతమైన ప్రేమలు, ఎక్కువైపోతే వచ్చే ప్రాబ్లమ్ అది. అది పర్సనల్ ఫంక్షన్ అనుకుని వచ్చా. ఆ తర్వాత తెలిసింది మీడియా కవర్డ్ అని.
తర్వాత తెలిసింది నాకు జాగ్రత్తగా ఉండాల్సిందని. అసలక్కడ కెమెరాలను పట్టించుకోలేదు నేను. ఎస్వీ కృష్ణారెడ్డి నేను బొట్టు పెట్టి డైరెక్టర్ చేసిన వ్యక్తి. ఆయన బర్త్ డే అంటే వెళ్లా. అందరూ నాతో పని చేసిన వాళ్లే. నా బిడ్డ లాంటి వారే. నేను ఒక్కొక్కరిని ఎంత బాగా పొగిడానో ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది. ముక్కలు చూస్తే తెలీదు. ఎవడికి కావాల్సిన ముక్కలు వాడేసుకుంటే మనం ఏమీ చేయలేము.
ఆ రోజున డేవిడ్ వార్నర్ ను అలా ఎందుకు అన్నానో హీరో నితిన్ ను అడిగితే చెబుతాడు. అంతకుముందే మేము చాలా చాలా గోల చేసి వచ్చాం. ఏదో ఫ్లో లో వచ్చేసింది. అది తప్పు అనేది తర్వాత తెలుసుకున్నాం. ఇవాళ ఉన్న సోషల్ మీడియాలో, పరిస్థితుల్లో.. పాత రోజుల్లో ఉన్న ఎఫెక్షన్స్ చూపించుకునే అవకాశాలు అయితే లేవు. అందుకని ఎవరి లిమిటేషన్ లో వారు ఉండటం బెటర్ అని నేను ఇప్పటికి నేర్చుకున్నటువంటి మంచి విషయం” అని నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.