Anushka Shetty : అనుష్క ఒక్క పోస్టర్ వల్ల 40 యాక్సిడెంట్ లు.. దెబ్బకు పోలీసులు రంగంలోకి దిగి.. ఈ విషయం తెలుసా?

అనుష్క కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో వేదం ఒకటి.

Anushka Shetty : అనుష్క ఒక్క పోస్టర్ వల్ల 40 యాక్సిడెంట్ లు.. దెబ్బకు పోలీసులు రంగంలోకి దిగి.. ఈ విషయం తెలుసా?

Do You Know Anushka Shetty Vedam Poster reason for so Many Accidents

Updated On : June 4, 2025 / 6:11 PM IST

Anushka Shetty : కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ హిట్స్ కొట్టి టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగింది అనుష్క శెట్టి. కానీ బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించి అడపాదడపా మాత్రమే చేస్తుంది. అనుష్క కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో వేదం ఒకటి. ఆ సినిమాలో అనుష్క వేశ్య పాత్ర వేసి అందర్నీ తన నటనతో మెప్పించి అందంతో అలరించింది.

వేదం సినిమా రిలీజయి నేటికీ 15 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా స్పెషల్ పోస్ట్ చేసాడు. ఇక అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సమయంలో అందరూ ఆశ్చర్యపోయే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా వాడారు.

Also Read : Pawan Kalyan : రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి.. నువ్వు దేవుడు సామీ..

ప్రమోషన్స్ లో భాగాంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారు. దీంతో ఆ హోర్డింగ్ లో అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్స్ చేసారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అనుష్క హోర్డింగ్ వల్ల దాదాపు 40 యాక్సిడెంట్ లు అయ్యాయట. పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా ఆ హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను గుద్దేసేవారట.

దీంతో రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరగడంతో పోలీసులు ఇది గమనించి GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట. అలా అనుష్క తన అందంతో ఎవర్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.

Also Read : Upasana Mother : హైదరాబాద్ నుంచి చెన్నైకు సైకిల్ మీద.. ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉపాసన తల్లి ఛాలెంజింగ్ ప్రయాణం..