Pawan Kalyan : రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి.. నువ్వు దేవుడు సామీ..

నిర్మాతకు అనుకున్నదానికంటే కూడా భారీగా ఖర్చు అయిందట.

Pawan Kalyan : రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి.. నువ్వు దేవుడు సామీ..

Pawan Kalyan Returns HariHara VeeraMallu Movie Advance Remuneration

Updated On : June 4, 2025 / 5:37 PM IST

Pawan Kalyan : పవన్ రాజకీయాల బిజీ వల్ల ఎప్పుడో మొదలయిన హరిహర వీరమల్లు సినిమా అయిదేళ్లుగా సాగి ఇటీవలే షూటింగ్ పూర్తవడంతో జూన్ 12 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమా అయిదేళ్లుగా సాగడం, సెట్స్ వేసినవి మళ్ళీ వేయాల్సి రావడం, షూటింగ్ హైదరాబాద్ నుంచి మంగళగిరికి మార్చడం, షూటింగ్ లేట్ అవడంతో తెచ్చిన ఫైనాన్స్ కి వడ్డీలు పెరగడం, సినిమా బడ్జెట్ కూడా పెరగడం.. ఇలా నిర్మాతకు అనుకున్నదానికంటే కూడా భారీగా ఖర్చు అయిందట.

దీంతో నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గాను తాను తీసుకున్న 11 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసాడని సమాచారం. పవన్ గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడుతూ నేను రోజుకు 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాను పనిచేసిన రోజులను బట్టి అని తెలిపాడు. ఈ సినిమాకు కేవలం 11 కోట్లు అడ్వాన్స్ తీసుకొని సినిమా రిలీజ్ అయ్యాక తీసుకుందాం అనుకున్నాడు.

Also Read : Upasana Mother : హైదరాబాద్ నుంచి చెన్నైకు సైకిల్ మీద.. ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉపాసన తల్లి ఛాలెంజింగ్ ప్రయాణం..

కానీ నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి ఇప్పుడు ఆ అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసాడు పవన్. దీంతో ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఏమి తీసుకోకుండానే పనిచేసినట్లు అయింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన లాభాల్లోంచి పవన్ రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్ వినిపిస్తుంది. గతంలో కూడా పవన్ అత్తారింటికి దారేది సినిమా లీక్ అయిందని, జానీ ఫ్లాప్ అయిందని.. వాటితో పలు సినిమాలకు కూడా రెమ్యునరేషన్ ల్లో కొంత భాగం తిరిగి ఇచ్చాడు.

అప్పుడంటే రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తిరిగి ఇస్తే సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పుడు సినిమాలు తక్కువ, డిప్యూటీ సీఎం జీతం పిఠాపురం అనాథాశ్రమానికి ఇచ్చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో కూడా నిర్మాత గురించి ఆలోచించి తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయడంతో నువ్వు దేవుడు సామీ, ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే అని పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also Read : Manchu Vishnu – Prabhas : ప్రభాస్ కి నేను ఆఫర్ ఇచ్చా.. అతనే సెలెక్ట్ చేసుకున్నాడు.. ఆ విషయంలో ప్రభాస్ ని ఇబ్బంది పెట్టాను..