Manchu Vishnu – Prabhas : ప్రభాస్ కి నేను ఆఫర్ ఇచ్చా.. అతనే సెలెక్ట్ చేసుకున్నాడు.. ఆ విషయంలో ప్రభాస్ ని ఇబ్బంది పెట్టాను..
తాజాగా మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ..

Manchu Vishnu Interesting Comments on Prabhas Regarding his Character in Kannappa Movie
Manchu Vishnu – Prabhas : మంచు విష్ణు భారీగా, స్టార్ కాస్ట్ పెట్టి తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. దీంతో మంచు విష్ణు ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కన్నప్ప సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లో వీరందరిని చూపించారు.
ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. నేను ప్రభాస్ కి ఆఫర్ ఇచ్చాను. కన్నప్ప సినిమాలో ఈ పాత్రలు ఉన్నాయని చెప్పి సినిమాలో ఉన్న పాత్రలన్నీ అతని ముందు పెట్టి సెలెక్ట్ చేసుకోమంటే తనే రుద్ర పాత్ర సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక నటుడిగా రుద్ర పాత్ర ప్రభాస్ కి ఒక మైలురాయిలా నిలిచిపోతుంది.
షూటింగ్ అయ్యాక ప్రభాస్ నేను డైలాగ్స్ ఎంజాయ్ చేశాను అని చెప్పాడు. డైలాగ్స్ విషయంలో ప్రభాస్ ని కొంత ఇబ్బందిపెట్టాను. పెద్ద పెద్ద డైలాగ్స్ ఇవ్వకు అన్నాడు కానీ కొన్ని పెద్ద డైలాగ్స్ ఇచ్చాను. ప్రభాస్ కోసం కొన్ని డైలాగ్స్ మార్చాను. ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా గౌరవించాలి. ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయకూడదు. సినిమాలో ప్రభాస్ పాత్ర దాదాపు అరగంట ఉంటుంది. ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుంది అని తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.