Manchu Vishnu : అతను చేసిన తప్పు వల్ల.. కన్నప్ప సినిమాకు 15 కోట్లు వేస్ట్ అయింది.. అందుకే ఆ డెషిషన్ తీసుకున్నా..
తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు VFX విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి తెలిపాడు.

Manchu Vishnu Says Costly Mistake for Kannappa in VFX and almost 15 Crores Wastage Happened
Manchu Vishnu : మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా జూన్ 27 రిలీజ్ కానుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో భారీగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉంది అని ఇప్పటికే విష్ణు తెలిపారు.
తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు VFX విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి తెలిపాడు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాకు ఒక అసమర్దుడిని VFX సూపర్ వైజర్ గా పెట్టుకున్నాను. నేను చేసిన తప్పు అదే. అతను చేసిన తప్పు వల్ల సినిమా సంవత్సరం ఆలస్యం అయింది. ఈ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. VFX సమస్యలు, VFX కంపెనీల గురించి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి అని తెలుసుకున్నాను. అతన్ని పెట్టుకోవడం వల్ల కన్నప్ప సినిమాకు విఎఫ్ఎక్స్ విషయంలో దాదాపు 10 నుంచి 15 కోట్లు వేస్ట్ అయింది. అంత కాస్ట్లీ తప్పు జరిగింది.
అందుకే ఈ సంవత్సరం నుంచి మోహన్ బాబు యూనివర్సిటీలో విఎఫ్ఎక్స్ కోర్స్ 3 ఇయర్స్ డిగ్రీ మొదలు పెడుతున్నాం. మూడేళ్ళలో మా కాంపౌండ్ నుంచే VFX టీమ్, సూపర్ వైజర్స్ ని రెడీ చేయాలి అన్నదే నా లక్ష్యం అని తెలిపారు.