RGV : సినిమా రివ్యూలకు సపోర్ట్ గా మాట్లాడిన ఆర్జీవీ.. వాటికి రివ్యూలు ఇస్తున్నప్పుడు సినిమాలకు ఎందుకు ఇవ్వకూడదు?
తాజాగా ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇవ్వగా ఈ రివ్యూల గురించి మాట్లాడారు.

Ram Gopal Varma Comments on Movie Reviews
RGV : గత కొన్నాళ్లుగా సినీ పరిశ్రమలో పలువురు నిర్మాతలు రివ్యూలను తప్పు పడుతున్నారు. రివ్యూలు సినిమా రిలీజయిన రోజే రాయడం వల్ల సినిమాకు ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు. అయితే వీళ్ళు వెబ్ సైట్ రివ్యూల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు కానీ అంతకంటే ఎక్కువ రీచ్ అయ్యే సోషల్ మీడియా, యూట్యూబ్ రివ్యూస్ గురించి మాత్రం స్పందించట్లేదు.
రివ్యూల గురించి సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇవ్వగా ఈ రివ్యూల గురించి మాట్లాడారు.
ఆర్జీవీ మాట్లాడుతూ.. సినిమాలే కాదు పాలిటిక్స్, ఈవెంట్స్, ఫోన్స్, రెస్టారెంట్స్.. ఇలా చాలా వాటిపై రివ్యూస్ ఇస్తారు. అన్ని జడ్జ్ చేస్తారు. అలాంటప్పుడు సినిమాల గురించి ఎందుకు జడ్జ్ చేయకూడదు. రివ్యూస్ ఎందుకు ఉండకూడదు సినిమాలకు. సోషల్ మీడియాలో కూడా రివ్యూలు చెప్తారు. వాళ్ళని ఆపగలమా? నిర్మాతలు కొంతమంది రివ్యూలు ఉండొద్దు, మూడు రోజుల తర్వాత ఇవ్వాలి అని చెప్పడానికి వాళ్లెవరు. సినిమా బాగోకపోతే సినిమా చూసొచ్చిన ఒక ఆడియన్ ఎవర్ని ఆ సినిమా చూడొద్దు అంటాడు, అతన్ని ఆపగలరా? రివ్యూ రాసేవాళ్ళు ఆడియన్స్ కోసం పని చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ కోసం కాదు అని అన్నారు. దీంతో ఇది కూడా నిజమే కాదా అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Also See : Supritha : శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సుప్రీత.. చీరకట్టులో పద్దతిగా.. ఫోటోలు వైరల్..