Upasana Mother : హైదరాబాద్ నుంచి చెన్నైకు సైకిల్ మీద.. ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉపాసన తల్లి ఛాలెంజింగ్ ప్రయాణం..
ఉపాసన తల్లి శోభన చేసిన సైక్లింగ్ గురించి చేసిన పోస్ట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Upasana Mother Sobhana Cycling from Hyderabad to Chennai
Upasana Mother : రామ్ చరణ్ భార్య ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని తెలిసిందే. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన తల్లి గురించి ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఉపాసన పిన్ని ప్రీత రెడ్డి ఉపాసన తల్లి శోభన చేసిన సైక్లింగ్ గురించి షేర్ చేసిన పోస్ట్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ ప్రకారం.. ఎలాంటి హడావిడి లేకుండా, ఏ మెడల్ కోసం, ఏదైనా మూమెంట్ కోసం కాకుండా ఉపాసన తల్లి శోభన హైదరాబాద్ లోని తన ఇంటి వద్ద నుంచి చెన్నైలోని తన తల్లితండ్రుల ఇంటి వరకు సైక్లింగ్ చేస్తూనే వెళ్లారట. ఆల్మోస్ట్ 600 కిలోమీటర్లు సైకిల్ మీదే వెళ్లారట. 60 ఏళ్ళ వయసులో మోకాలికి ఆపరేషన్ అయినా, నెక్ లో ప్లేట్స్ ఉన్నా, ఇంకా పలు గాయాలు ఉన్నా తనకు తాను ఛాలెంజింగ్ గా తీసుకొని అంత దూరం సైక్లింగ్ చేసిందని తెలిపింది ఉపాసన.
Also Read : Shobha Shetty : సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న బిగ్ బాస్ భామ.. ఏమైంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..
నిన్న వరల్డ్ సైకిల్ డే సందర్భంగా ప్రీత రెడ్డి ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. దీంతో ఉపాసన తల్లి శోభనను అంతా అభినందిస్తున్నారు.
View this post on Instagram