Shobha Shetty : సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న బిగ్ బాస్ భామ.. ఏమైంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..
నటి శోభా శెట్టి తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో నెగిటివ్ పాత్రలో నటించి బాగా వైరల్ అయింది.

Karthika Deepam Bigg Boss Fame Shobha Shetty Taking Break from Social Media
Shobha Shetty : బుల్లితెర నటి శోభా శెట్టి తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో నెగిటివ్ పాత్రలో నటించి బాగా వైరల్ అయింది. అనంతరం బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పలు సీరియల్స్, షోస్ చేస్తున్న శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొని ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే బయటకు వచ్చేసింది.
తాజాగా శోభా శెట్టి.. నేను కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను థ్యాంక్యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఎందుకు, ఏమైంది, ఏం జరిగింది అంటూ ఆమె ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు ఆమె పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే శోభా శెట్టి ఎందుకని సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటుందో, ఏం జరిగిందో అని తెగ ఆలోచిస్తున్నారు ఆమె అభిమానులు.
ఇక శోభా శెట్టి ఇప్పటికే మరో నటుడు, తన ప్రియుడు యశ్వంత్ ని ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారేమో చూడాలి.
Also See : Supritha : శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సుప్రీత.. చీరకట్టులో పద్దతిగా.. ఫోటోలు వైరల్..