Matti Kusthi: రవితేజ నిర్మాణంలో తమిళ హీరో విష్ణు విశాల్ సినిమా.. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్..
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తూ నటన మీదే దృష్టి పెడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టబోతున్నాడు. "RT టీమ్‌వర్క్స్" అనే ఈ సంస్థలో కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ, కొత్తవారికి అవకాశం కల్పించనున్నాడు. ఈ క్రమంలోనే తమిళ హీరో విష్ణు విశాల్ గత చిత్రం ఎఫ్ఐఆర్కి సమర్పకుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు విశాల్ తరువాతి రాబోయే చిత్రం...
- gum 95921
- Published on- November 2, 2022 / 08:46 PM IST
Ravi Teja Produces Tamil Hero Vishnu Vishal Matti Kusthi Movie
Matti Kusthi: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తూ నటన మీదే దృష్టి పెడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టబోతున్నాడు. “RT టీమ్‌వర్క్స్” అనే ఈ సంస్థలో కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ, కొత్తవారికి అవకాశం కల్పించనున్నాడు. ఈ క్రమంలోనే తమిళ హీరో విష్ణు విశాల్ గత చిత్రం ఎఫ్ఐఆర్కి సమర్పకుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Raviteja: మళ్లీ ఇద్దరు బ్యూటీలతో మాస్ రాజా రొమాన్స్.. ఈసారి ఎవరంటే?
కాగా ఇప్పుడు విశాల్ తరువాతి రాబోయే చిత్రం “మట్టి కుస్తికి” నిర్మాణ భాగస్వామిగా మారాడు. RT టీమ్‌వర్క్స్‌తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మట్టి కుస్తి అనేది ఒక స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో విష్ణు విశాల్ రెజ్లర్‌గా కనిపించనున్నాడు. రెడ్ కలర్ రెజ్లింగ్ జెర్సీలో కుస్తీ బరిలోకి దిగుతున్న విశాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రవితేజ నేడు విడుదల చేశాడు. ఈ సినిమాతో విశాల్ మూడోసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక నటిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా రవితేజ కి ప్రొడ్యూసర్ గా ఎంతవరకు బూస్ట్ ఇవ్వగలదు చూడాలి.
