Raviteja: మళ్లీ ఇద్దరు బ్యూటీలతో మాస్ రాజా రొమాన్స్.. ఈసారి ఎవరంటే?

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో యమబిజీగా ఉన్నాడు. ఇప్పటికే రవితేజ ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ అనే సినిమాను కూడా చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ మామూలుగా ఉండదని తెలుస్తోంది.

Raviteja: మళ్లీ ఇద్దరు బ్యూటీలతో మాస్ రాజా రొమాన్స్.. ఈసారి ఎవరంటే?

Raviteja To Romance Again With Two Young Beauties

Raviteja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో యమబిజీగా ఉన్నాడు. ఇప్పటికే రవితేజ ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూకుడుమీదున్న రవితేజ, త్వరలోనే మరో సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Raviteja: ‘రావణాసుర’ రిలీజ్ డేట్ రివీల్ చేసిన రవితేజ

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు మాస్ రాజా. అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. కాగా, ఈ సినిమాలోనూ రవితేజ ఇద్దరు అందాల భామలతో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌తో పాటు మరో బ్యూటీ కావ్య థాపర్‌లతో రొమాన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

Raviteja: జింతాత అంటూ మళ్లీ వస్తోన్న ‘విక్రమార్కుడు’

ఇక ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారని, పోలాండ్‌లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను రవితేజపై చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.