Raviteja: ‘రావణాసుర’ రిలీజ్ డేట్ రివీల్ చేసిన రవితేజ

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ మూవీపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Raviteja: ‘రావణాసుర’ రిలీజ్ డేట్ రివీల్ చేసిన రవితేజ

Raviteja Ravanasura Movie Locks Release Date

Raviteja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ‘ధమాకా’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న మాస్ రాజా, ఈ సినిమా తరువాత టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర వంటి వైవిధ్యమైన కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ను రవితేజ ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Raviteja: జింతాత అంటూ మళ్లీ వస్తోన్న ‘విక్రమార్కుడు’

అయితే దీపావళి పండగ సందర్భంగా రవితేజ ‘రావణాసుర’ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్‌ను రివీల్ చేశాడు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తోండగా, ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను 2023 ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లుగా ఓ సరికొత్త పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Raviteja Ravanasura Movie : రవితేజ సినిమా కోసం 5 కోట్లతో సెట్.. భారీగా ప్లాన్ చేస్తున్న రావణాసుర..

ఇక ఈ సినిమాలో ఏకంగా అయిదుగు ముద్దగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తుండటం విశేషం. అను ఇమ్మాన్యుయెల్, పూజిత పొన్నాడ, దక్ష నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపిస్తారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్ వర్క్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.