Raviteja Dhamaka movie Pulsar Bike song got 100 million views in youtube
Dhamaka : రవితేజ (Raviteja) నటించిన ధమాకా సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిన విషయమే. ప్రసన్న కుమార్ బెజవాడ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) కనిపించింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ కి రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ శ్రీలీల వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మూవీలోని స్పెషల్ సాంగ్ అయిన పల్సర్ బైక్ (Pulsar Bike) సాంగ్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది.
స్క్రీన్ పై రవితేజ అండ్ శ్రీలీల మాస్ స్టెప్స్ చూసి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూశారు. దీంతో ఇటీవల ఈ వీడియో పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక యూట్యూబ్ లో ఈ సాంగ్ రికార్డు వ్యూస్ అందుకొని సంచలనం సృష్టించింది. ఈ పాట తాజాగా 100 మిలియన్ పైగా వ్యూస్ అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ట్వీట్ చేయగా.. నెటిజెన్లు మరోసారి ఆ పాటని చూసేస్తున్నారు.
కాగా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలో నటిస్తున్నాడు. ఒకప్పుడు స్టూవర్టుపురం దొంగగా అందర్నీ భయపెట్టిన టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఈ మూవీతోనే పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఒకప్పటి హీరోయిన్ రేణుదేశాయ్ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ఈ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. అక్టోబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది.