×
Ad

Irumudi First Look: రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’.. ఫస్ట్ లుక్ విడుదల

రవితేజ కొత్త సినిమా ఇరుముడి(Irumudi First Look) ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్.

raviteja irumudi movie first look released

  • రవి తేజ కొత్త సినిమా ‘ఇరుముడి’
  • అయ్యప్ప స్వామి దీక్ష కథతో సినిమా
  • ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్

Irumudi First Look; మాస్ మహారాజ్ రవితేజ గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక బాధపడుతున్నాడు. ఎలాంటి సినిమాలు చేసినా ఆడియన్స్ అంత శాటిస్ఫై అవడం లేదు. రీసెంట్ గా ఆయన మాస్ నుంచి క్లాస్ లుక్ లోకి వచ్చిన చేసిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఈనేపథ్యంలో ఆయన తన తరువాతి సినిమా కోసం దర్శకుడు శివ నిర్వాణను ఎంచుకున్నాడు.

Psych Siddhartha OTT: ఓటీటీలో లేటెస్ట్ మూవీ ‘సైక్‌ సిద్ధార్థ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆయన దర్శకత్వంలో రవి తేజ చేస్తున్న కొత్త సినిమా ‘ఇరుముడి(Irumudi First Look)’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న రవితేజ లుక్ చాలా బాగుంది. చూడగాని చాలా పాజిటీవ్ వైబ్ క్రియేట్ చేసింది ఈ పోస్టర్. అయ్యప్ప మాలధారణ సమయంలో ఇరుముడికి ఎంత ప్రత్యేకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమాలో కూడా అదే విషయాన్ని చాలా ఎమోషనల్ గా చెప్పబోతున్నారట మేకర్స్. ఇలాంటి క్లాస్ సినిమాలు చేయడంలో దర్శకుడు శివ నిర్వాణం దిట్ట. అలాంటి దర్శకుడు ఇరుముడి లాంటి డివోషనల్ కంటెంట్ తో ఉన్న సినిమా చేస్తున్నారు అంటే అది తప్పకుండా మంచి విజయం సాదించడం అనేది కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా 2026 ఎండింగ్ అంటే అయ్యప్ప మాలధారణ జరిగే సమయంలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.