Raviteja: బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తోన్న మాస్ రాజా.. రెడీగా ఉండండి అబ్బాయిలు!

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ అంశాలతో ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇక ఈ సినిమాలో మాస్ రాజా పర్ఫార్మెన్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఈ సినిమా సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయకముందే, ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో మళ్లీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు ఈ మాస్ మహారాజ్.

Raviteja Mirapakay Movie To Re-Release On January 25

Raviteja: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ అంశాలతో ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇక ఈ సినిమాలో మాస్ రాజా పర్ఫార్మెన్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఈ సినిమా సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయకముందే, ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో మళ్లీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు ఈ మాస్ మహారాజ్.

Raviteja: రవితేజ నెక్ట్స్ ప్రాజెక్టు నుండి అప్డేట్ వదిలిన చిత్ర యూనిట్!

మెగాస్టార్ మెయిన్ హీరో అయినా కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్నాడు రవితేజ. అయితే ఇప్పుడు మళ్లీ తన అభిమానులకు ఫుల్టూ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. రవితేజ నటించిన ‘మిరపకాయ్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు కానుకగా ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించగా, రమేష్ పుప్పల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. మరి ‘మిరపకాయ్’ మూవీ రీ-రిలీజ్‌తో ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.