Sundaram Master Teaser : సుందరం మాస్టర్ మొదటి క్లాస్ మొదలైంది.. హాజరయిన సెలబ్రిటీ స్టూడెంట్స్..
రవితేజ నిర్మిస్తున్న ‘సుందరం మాస్టర్’ టీజర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకులు చందు ముండేటి, సుధీర్ వర్మ ఆధ్వర్యంలో టీజర్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
- gum 95921
- Published On : July 11, 2023 / 04:34 PM IST
Raviteja producing movie Sundaram Master Teaser released by Sai Dharam Tej
Sundaram Master Teaser : టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వైవా హర్ష (Viva Harsha) ప్రధాన పాత్రలో ‘సుందరం మాస్టర్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మాస్ మహారాజ్ రవితేజ నిర్మిస్తున్నాడు. ఆర్ టి టీం వర్క్స్, గోల్‌డెన్ మీడియా బ్యానర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఇప్పుడు ఈ మూవీ టీజర్ ని విశాఖపట్నంలో గ్రాండ్ గా లాంచ్ చేశారు.
Dhoni – LGM : చెన్నైలోనే నా మొదటి డెబ్యూట్ జరిగింది.. ఇప్పుడు నిర్మాతగా నా మొదటి సినిమా.. ధోని!
ఈ లాంచ్ ఈవెంట్ కి సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), దర్శకులు చందు ముండేటి, సుధీర్ వర్మ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక ఈ టీజర్ ని రవితేజ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. టీజర్ ఫుల్ ఎంటర్‌టైనింగ్ ఉంది. ఒక అటవీ ప్రాంతంలోని ట్రైబల్స్ కి పాటలు చెప్పడానికి వచ్చిన హర్షకి అక్కడ పెద్ద షాక్ తగులుతుంది. అక్కడి ట్రైబల్స్ ఇంగ్లీష్ మాట్లాడుతూ బాగా తెలివిగల వారీగా కనిపిస్తారు. హర్ష అండ్ వారి మధ్య సన్నివేశాలను దర్శకుడు చాలా కామిక్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది టీజర్ చూస్తుంటే.
Bholaa Shankar : భోళా శంకర్ పార్టీ సాంగ్ వచ్చేసింది.. ‘జాం జాం జజ్జనక’ అంటూ పాట అదిరిపోయింది..
కళ్యాణ్ సంతోష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దివ్య శ్రీపాద (Divya Sripada) ఫిమేల్ లీడ్ చేస్తుంది. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇంకా తెలియజేయలేదు. టీజర్ మాత్రం మూవీ పై ఆసక్తిని కలుగజేసింది. ఈ మధ్య చిన్న సినిమాలుగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ లు అందుకున్న సినిమాల జాబితాలో ఈ మూవీ కూడా చేరుతుందని అనిపిస్తుంది.
