Bholaa Shankar : భోళా శంకర్ పార్టీ సాంగ్ వచ్చేసింది.. ‘జాం జాం జజ్జనక’ అంటూ పాట అదిరిపోయింది..
చిరంజీవి భోళా శంకర్ నుంచి పార్టీ సాంగ్ రిలీజ్ అయ్యింది. 'జాం జాం జజ్జనక' అంటూ పాట ఫుల్ ఎనర్జీగా ఉంది.

Jam Jam Jajjanaka Lyrical song released from Chiranjeevi Bholaa Shankar
Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తరువాత చేస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్ స్టార్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా కథ ఉండబోతుంది. ఇక చిరుకి చెల్లిగా మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపిస్తుంటే ఆమెకు జోడిగా అక్కినేని హీరో సుశాంత్ కీర్తికి కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
Sundaram Master Teaser : సుందరం మాస్టర్ మొదటి క్లాస్ మొదలైంది.. హాజరయిన సెలబ్రిటీ స్టూడెంట్స్..
రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ లో వేగంగా పెంచేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అండ్ టీజర్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటని రిలీజ్ చేశారు. ‘జాం జాం జజ్జనక’ అనే సాగే పార్టీ సాంగ్ ని విడుదల చేశారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇక శేఖర్ మాస్టర్.. చిరు, తమన్నా, కీర్తి, సుశాంత్ తో పాటని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడు.
Dhoni – LGM : చెన్నైలోనే నా మొదటి డెబ్యూట్ జరిగింది.. ఇప్పుడు నిర్మాతగా నా మొదటి సినిమా.. ధోని!
కాగా ఈ మూవీ తమిళ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్యలో గోదావరి యాసతో అదరగొట్టిన చిరు.. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో అలరించబోతున్నాడు. వాల్తేరు చిత్రంలో లాగానే ఈ మూవీలో కూడా వింటేజ్ చిరు కామెడీ కనిపిస్తుందని మేకర్స్ తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆగష్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.