BuchiBabu Sana : RC16 డైరెక్టర్ బుచ్చిబాబు సాన.. ఎంతైనా తోపు అబ్బా..
అభిమానులు, సినిమా లవర్స్ కూడా బుచ్చిబాబుని తెగ పొగిడేస్తున్నారు. ఎంతైనా బుచ్చిబాబు తోపు అని అంటున్నారు.
- Saketh U
- Published On : March 21, 2024 / 07:38 AM IST
RC 16 Movie Director BuchiBabu Sana Interesting Story
BuchiBabu Sana : రామ్ చరణ్(Ram Charan) నెక్స్ట్ సినిమా RC16ని డైరెక్ట్ చేయబోతున్నాడు బుచ్చిబాబు సాన. నిన్న మార్చ్ 20 ఈ సినిమా పూజా కార్యక్రమం జరగగా వచ్చిన సీలబ్రిటీలు అంతా బుచ్చిబాబుని పొగిడేశారు. సోషల్ మీడియాలో కూడా అభిమానులు, సినిమా లవర్స్ కూడా బుచ్చిబాబుని తెగ పొగిడేస్తున్నారు. ఎంతైనా బుచ్చిబాబు తోపు అని అంటున్నారు.
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఆయన దగ్గరే ఎదిగాడు బుచ్చిబాబు. సుకుమార్ చేసిన అన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసాడు. తన మొదటి సినిమాకి సుకుమార్ ని కూడా నిర్మాతగా చేసాడంటే బుచ్చిబాబు ఆయన గురువుని ఏ రేంజ్ లో మెప్పించి ఉండాలి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లాంటి ఇద్దరు కొత్తవాళ్ళని పెట్టి, ఓ కొత్త డైరెక్టర్ ఉప్పెన లాంటి ప్రేమ కథతో ఏకంగా 100 కోట్ల భారీ హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. కానీ బుచ్చిబాబు చేసి చూపించాడు.
అంతేకాకుండా మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని నిలబెట్టి వైష్ణవ్ ని సేఫ్ గా హీరోగా లాంచ్ చేసి మెగా అభిమానుల మనసులని గెలుచుకున్నాడు. ఇప్పుడు తన రెండో సినిమానే ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఓ ప్రేమ కథ తీసిన డైరెక్టర్, ఒకటే సినిమా తీసిన డైరెక్టర్ కి RRR తో ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చుకున్న రామ్ చరణ్ పిలిచి సినిమా ఇచ్చాడంటే మాములు విషయం కాదు. బుచ్చిబాబు చెప్పిన కథ, అతని నెరేషన్ ఎంత నచ్చకపోతే, అతన్ని ఎంత నమ్మకపోతే చరణ్ ఛాన్స్ ఇస్తాడు.
Also Read : Samantha : బాలీవుడ్‌లో ‘సిటాడెల్’ సిరీస్‌కి సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..? కెరీర్‌లోనే హైయెస్ట్..
ఇదంతా ఒక ఎత్తు అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి బుచ్చిబాబు చాలా కష్టపడుతున్నాడు. ఆల్రెడీ సినిమాలో మూడు పాటలు కంపోజ్ కూడా అయ్యాయి. సినిమా షూట్ కూడా మొదలుపెట్టకముందే ఏఆర్ రహమాన్ లాంటి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఒప్పించడం, ఆల్రెడీ మూడు పాటలు కంపోజ్ చేయడం అంటే బుచ్చిబాబు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థమైపోతుంది.
ఇక RC 16 సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ ని తీసుకొచ్చి జగదేక వీరుడు అతిలోక సుందరి జంటని గుర్తుచేసి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చాడు బుచ్చిబాబు. సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి చిరంజీవి, బోని కపూర్, సుకుమార్, ఏఆర్ రహమాన్, శంకర్.. లాంటి మహామహులంతా వచ్చి బుచ్చిబాబు గురించి గొప్పగా చెప్పారు. వాళ్ళందర్నీ సాదరంగా దగ్గరుండి లోపలి తీసుకెళ్లాడు బుచ్చిబాబు. అటు సినిమా కంటెంట్ తోను అందర్నీ మెప్పించి, ఇటు తన మంచితనంతోను ముగ్ధుల్ని చేస్తున్నాడు.
Also Read : Karthika Deepam : సీరియల్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ‘కార్తీక దీపం’ అంటే ఆమాత్రం ఉంటుందిలే..
రామ్ చరణ్ ఇచ్చిన ఛాన్స్ చక్కగా ఉపయోగించుకుంటానని, చరణ్ అభిమానులకు గుర్తుండిపోయే సినిమా ఇస్తానని బుచ్చిబాబు RC16 అనౌన్స్ చేసినప్పటినుంచి చెప్తూనే వస్తున్నాడు. బుచ్చిబాబు మీద చాలా నమ్మకం ఉంది కాబట్టే రామ్ చరణ్ ఛాన్స్ ఇచ్చాడు, సుకుమార్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా మారాడు. ఇంతమంది బుచ్చిబాబుని నమ్మడం, పొగడటం, రెండో సినిమాకే చరణ్ – జాన్వీలని కలిపి సినిమా తీయడం అంటే విశేషమే. అందుకే బుచ్చిబాబు ఎంతైనా తోపురా అని అభిమానులు, సినిమా లవర్స్ అంటున్నారు. RC16 సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
