RC15: చరణ్ హైదరాబాద్ టు వైజాగ్.. వయా కర్నూల్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ RC15 అనే వర్కింగ్ టైటల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ గురించి చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్ ఇస్తూ నెట్టింట సందడి చేస్తోంది.

RC15 Shooting To Shift To Vizag

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ RC15 అనే వర్కింగ్ టైటల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ గురించి చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్ ఇస్తూ నెట్టింట సందడి చేస్తోంది.

RC15 : కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర రామ్‌చరణ్ రాజకీయ సభ..

ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్ చార్మినార్ వద్ద జరుపుకుంటున్నట్లుగా దర్శకుడు శంకర్ తెలిపాడు. ఈమేరకు ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక అటుపై ఈ సినిమా షూటింగ్ కర్నూల్‌కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ కొండారెడ్డి బురుజుపై కొంతమేర షూటింగ్ జరుపుకుంది. ఓ సాంగ్ నేపథ్యంలో ఈ షూటింగ్ జరుగుతున్నట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక తాజాగా ఈ సాంగ్ షూటింగ్ వైజాగ్‌కు మారనుందట.

RC15: చార్మినార్ దగ్గర చరణ్ మూవీ షూటింగ్.. అప్డేట్ ఇచ్చిన శంకర్!

ఫిబ్రవరి 13 నుండి ఈ సాంగ్ షూటింగ్‌ను విశాఖలో నిర్వహించనున్నారు. ఈ సాంగ్‌లో చరణ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.