RC15: చార్మినార్ దగ్గర చరణ్ మూవీ షూటింగ్.. అప్డేట్ ఇచ్చిన శంకర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RC15: చార్మినార్ దగ్గర చరణ్ మూవీ షూటింగ్.. అప్డేట్ ఇచ్చిన శంకర్!

RC15 Movie Shooting At Charminar

Updated On : February 9, 2023 / 9:35 PM IST

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RC15: చరణ్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ జరిగేది ఇక్కడే..!

ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైనా పాత్రల్లో నటిస్తుండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ను చిత్ర దర్శకుడు శంకర్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతం చార్మినార్ వద్ద జరుపుకుంటున్నట్లుగా ఆయన తెలిపాడు. దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇక్కడ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.