Ranveer Singh: దీపికా ఇది వినవమ్మా.. అలా చేయడం తప్పుకాదట.. భార్యకు కౌంటర్ ఇచ్చిన రణవీర్
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
Hero Ranveer Singh gave a counter-response to Deepika over the 8 Call Sheet comments.
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు, సినిమాకు వస్తున్నా పాజిటీవ్ టాక్ తో ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో దురంధర్ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, దురంధర్ మూవీ ఘన విజయం సాధించిన నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు హీరో రణవీర్ సింగ్(Ranveer Singh).
Rewind 2025: 2025 బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలు.. అంచనాలకు మించి..
ఈ ఇంటర్వ్యూ లో భార్య దీపికా పదుకునే చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు. స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె గతంలో 8 గంటల వర్క్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ పై దీపికా చాలా ట్రోలింగ్ ని ఎదుర్కొంది. అంతేకాదు, ఈ కారణంగా ఆమెను రెండు భారీ ప్రాజెక్టుల నుంచి కూడా తీసేశారు. దాంతో, ఆ ఇష్యు మరింత సంచలంగా మారింది. ఇక తాజాగా భార్య దీపికా చేసిన కామెంట్స్ పై షాకింగ్ రిప్లై ఇచ్చాడు రణవీర్ సింగ్.
ఈ ఇంటర్వ్యూలో దీపికా 8 గంటల కామెంట్స్ ని ప్రశవించారు యాంకర్. దానికి సమాధానంగా రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. “పని గంటల విషయంలో చాలా సార్లు సహచర నటీనటులు నాపై ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఎందుకంటే, నేను కొన్నిసార్లు 10 నుంచి12 గంటలు షూటింగ్ చేస్తూనే ఉంటాను. దాంతో, వారు కూడా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా వారి ఇతర సినిమాల షెడ్యూల్ కు ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు 8 గంటల్లో అనుకున్న షూట్ పూర్తి కాకపోవచ్చు కదా. అప్పుడు ఎక్కువ సేపు షూటింగ్ చేసుకోవడంలో తప్పు లేదు కదా” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రణవీర్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి భర్త చేసిన ఈ కామెంట్స్ పై దీపికా ఎలా స్పందిస్తుందో అనేది చూడాలి.
