RC17 : చెర్రీతో సారా.. RC17 గ్రాండ్ లాంచ్ ఆరోజే..!
RC17 : రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో RC17 మూవీ తెరకెక్కబోతోంది
- Thota Vamshi Kumar
- Published on- October 31, 2026 / 11:48 AM IST
RC17 Grand Launch on November 1 heroine sara arjun
RC17 : రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో RC17 మూవీ తెరకెక్కబోతోంది. అయితే RC17లో హీరోయిన్ ఎవరు.? మ్యూజిక్ ఎవరు అందిస్తారు.? ఇలా ఎన్నో సస్పెన్స్‌లు కంటిన్యూ అవుతున్నాయి. నవంబర్ ఫస్ట్‌న ఓపెనింగ్ కార్యక్రమం ఉండటంతో నటీనటులు ఎవరన్నదానికో కొత్త కొత్త లీకులు చక్కర్లు కొడుతున్నాయి.
లేటెస్ట్‌గా RC17 గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ధురంధర్ ఫేమ్ హీరోయిన్ సారా అర్జున్ ఫోటోషూట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రామ్‌చరణ్ లుక్‌కు సంబంధించి కూడా ఫోటోషూట్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
Nayani Pavani : హాలోవీన్ వేడుకల్లో నయని పావని.. ఫోటోలు వైరల్..
RC17లో రామ్‌చరణ్‌ను సుకుమార్ ఎలాంటి కొత్త లుక్‌లో చూపించబోతున్నారు? సారా అర్జున్ ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారా? అనే ఆసక్తి నెలకొంది. ఇక నవంబర్ 1న RC17 పూజా కార్యక్రమాన్ని అత్యంత గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
గతంలో రంగస్థలంతో బ్లాక్‌బస్టర్ అందించిన ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సారా అర్జున్ ఫోటోషూట్, రామ్ చరణ్ లుక్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా పూజా కార్యక్రమం రోజు ఏదైనా క్లారిటీ ఇస్తారా.? లీకులు..రూమర్స్‌తోనే హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్తారా అనేది వేచి చూడాలి మరి.
