Re Releases of Jalsa, Thammudu, Pokiri, Billa, Mirchi
Mahesh Babu: ఒక పక్క రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయినట్టు వరసగా ఫ్లాప్ అవుతుంటే.. మరో పక్క అదే స్టార్ హీరోల పాత సినిమాలు థియేటర్ల వద్ద మరోమారు బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి కొత్త సినిమాలు రిలీజ్ చెయ్యడం కంటే పాత సినిమాలతో ఉన్న క్రేజ్ ని ఇంకాస్త పెంచుకోవడం బెటరని అని ఫీలవుతున్నారు హీరోలు. అందుకే మహేష్ బాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, ప్రభాస్ వరకూ అందరూ పాత సినిమాల మీదే పడ్డారు.
Jalsa Special Show: రీ-రిలీజ్‌లోనూ దుమ్ములేపిన పవన్ కళ్యాణ్.. జల్సా చేసుకున్న ఫ్యాన్స్!
స్టార్ హీరోల పాత హిట్ సినిమాల్ని కొత్తగా 4 కెలో, బెటర్ విజువల్స్ తో చూపిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో మొన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ జల్సా, తమ్ముడు సినిమాల్ని రీ రిలీజ్ చేశారు. 2008 ఏప్రిల్ 2న రిలీజ్ అయిన జల్సాకు రీ రిలీజ్ లో దాదాపు మూడున్నర కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టింది. మహేష్ బాబు బర్త్ డేకి కూడా తన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ పోకిరిని వరల్డ్ వైడ్ గా 500 పైగా షోలతో అమెరికాలో 50కి పైగా షోలతో రీ రిలీజ్ చేయగా కోటిన్నర కలెక్ట్ చేసింది.
ఇదే దారిలో హీరో ప్రభాస్ కూడా తన పాత సినిమాని బర్త్ డే రోజు రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ తన బర్త్ డే రోజు మాత్రం ఫాన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన బిల్లాతో పాటు క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒకేసారి కనెక్ట్ అయ్యేలా చేసిన మిర్చి మూవీని కూడా ప్రభాస్ బర్త్ డే కనుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో మరోసారి ఈమధ్యకాలంలో మిస్ అవుతున్న ప్రభాస్ ని థియేటర్లో కళ్ళారా చూసుకోవాలని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.