Adipurush Failure Reasons : ఆదిపురుష్ సినిమా ఫెయిల్ అవ్వడానికి మొత్తం 5 రీజన్స్.. అవేంటో తెలుసా?

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యి.. విమర్శలు, వివాదాల్లో చిక్కుకుంటుంది. అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

Reasons for failure of Prabhas Adipurush movie at box office

Prabhas Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ సినిమా భారీ అంచనాలతో జూన్ 16న ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడమే కాకుండా విమర్శలు, వివాదాల్లో చిక్కుకుంటుంది. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ కూడా భారీగా పడిపోతున్నాయి. అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో తెలుసా..? అవి ఇక్కడ తెలుసుకోండి.

Adipurush : ఆదిపురుష్ స్పెషల్ ఆఫర్.. 150 రూపాయలకే 3D టికెట్.. కానీ ఆఫర్ కేవలం..

సినిమా స్వేచ్ఛ..
బాహుబలి లాంటి ఫాంటసీ డ్రామా సినిమా తీస్తున్నప్పుడు సినిమా స్వేచ్ఛ ఉపయోగించుకొని చిత్రాన్ని ఎలా అయినా చూపించవచ్చు. కానీ చరిత్ర, ఇతిహాసాలపై సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇప్పటి జనరేషన్ పిల్లలకు రామాయణం బాగా అర్ధం అయ్యేలా.. హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాల మాదిరి రామాయణాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ క్రమంలో పాత్రల వేషధారణలో మార్పులు చేసి సాహసం చేశారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన రామాయణంలో ఉన్న గెటప్స్ ఆదిపురుష్ లోని గెటప్స్ వేరుగా ఉండడంతో ఆడియన్స్ అంగీకరించలేకపోయారు.

ముఖ్యంగా రాముడికి మీసాలు అన్న పాయింట్ చాలా మంది ఒప్పుకోలేకపోయారు. అలాగే రావణాసురుడు, ఇంద్రజిత్ గెటప్స్ మోడరన్ కల్చర్ కి తగట్టు ఉండడం, హాలీవుడ్ సూపర్ హీరోల చిత్రాల తరహాలో స్క్రీన్ ప్లేని రాసుకోవడంతో.. ఆదిపురుష్ అసలు రామాయణమే కాదన్న కామెంట్స్ వినబడ్డాయి.

డైలాగ్స్..
సినిమాలో హనుమంతుడి పాత్రతో పంచ్ డైలాగ్స్ చెప్పించే ప్రయత్నం చేసి పెద్ద తప్పు చేశారు. ఎప్పుడు రామనామం జపించే హనుమంతుడి నోటి నుంచి అభ్యంతరకర రీతిలో మాటలు రావడం ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది. అయితే తమ తప్పు తెలుసుకున్న మేకర్స్.. ఈ డైలాగ్స్ ని మార్చి రాశారు.

VFX వర్క్స్..
దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కుతుండడంతో గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ టీజర్ చూసిన తరువాత యానిమేటెడ్ గ్రాఫిక్స్ లా ఉన్నాయంటూ భారీ ట్రోలింగ్ ఎదురుకోవడంతో మూవీ పై ఉన్న అంచనాలు అన్ని పోయాయి. రీ వర్క్ కోసం వెనక్కి వెళ్లి 6 నెలలు కష్టపడి వచ్చినా.. ఇంకా మూవీలోని కొన్ని చోట్ల VFX వర్క్ దారుణంగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక రావణలంకని హాలీవుడ్ సినిమా థోర్ చిత్రంలోని లొకేషన్ జస్ట్ కలర్ మార్చి ఉన్నది ఉన్నట్లు చూపించడం, యుద్ధ సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ లో న్యూయార్క్ సిటీ కనిపించడం వంటివి భారీగా ట్రోల్ అవుతున్నాయి.

Adipurush : బాక్సాఫీస్‌ వద్ద 78 శాతం ఆదిపురుష్ కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వచ్చాయి..

రామాయణం కథ..
ఆదిపురుష్ అని టైటిల్ ని పెట్టడంతో సంపూరణ రామాయణం చూపిస్తారని అందరూ భావించారు. కానీ దర్శకుడు.. కేవలం వనవాసం మరియు రామరావణ యుద్ధ ఘట్టాలను మాత్రమే చూపించడంతో ప్రేక్షకులు నిరాశ పడ్డారు. అయితే ఈ రెండు ఘట్టాలను కూడా వివరంగా చూపించలేకపోయారు అంటున్నారు విమర్శకులు. కుంభకర్ణుడి యుద్ధ సన్నివేశాలను, ఆ క్యారెక్టర్ ని వివరంగా చూపించే ప్రయత్నమే చేయలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రచారం..
సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆదిపురుష్ రామాయణ కథ అని చెప్పుకొచ్చిన మేకర్స్.. రిలీజ్ అయ్యి విమర్శలు, వివాదాలు ఎదురుకోగానే అసలు ఇది రామాయణమే కాదు అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. రామాయణంలోని పాయింట్స్ తీసుకోని ఆదిపురుష్ అనే సినిమా తీసామంతే అంటూ చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా హనుమంతుడు అసలు దేవుడే కాదంటూ వివాదాస్పద కామెంట్స్ చేసి సినిమాపై మరింత వ్యతిరేకత వచ్చేలా చేసుకున్నారు. ఇలా ఒకదాని తరువాత ఒకటి తప్పులు చేసుకుంటూ వచ్చి నేడు మేకర్స్ పెద్ద సమస్యలను ఎదురుకుంటున్నారు.