Due Date : డ్యూ డేట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు..
లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం డ్యూ డేట్(Due Date).
- Thota Vamshi Kumar
- Published on- October 6, 2026 / 12:21 PM IST
Regular shoot of Due Date begins in Hyderabad
Due Date : లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం డ్యూ డేట్. ఆనంద్.కె దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీనులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకోగా సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. హీరో, హీరోయిన్ ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
Anupama Parameswaran : హాఫ్ శారీలో అనుపమ.. అదిరిపోయే ఫోటోలు..
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పారు. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది అని అన్నారు. నేటి నుంచి 15 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో తొలి షెడ్యూల్ పూర్తి అవుతుందన్నారు. ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు.
