Rekha Vedavyas : అంత మంచి హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి? హెల్త్ ప్రాబ్లమ్స్..?

ఇటీవల తెలుగులో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి వచ్చింది రేఖ. తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా ఈ షోలో రేఖని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Rekha Vedavyas has changed beyond recognition recent photos goes viral

Rekha Vedavyas : కొంతమంది హీరోయిన్స్ 40 ఏళ్ళు దాటినా అంతే యవ్వనంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. తాజాగా ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరికి షాకిచ్చింది.

ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్.. లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది రేఖ. ఈ సినిమాలు మంచి విజయం సాధించిన ఆతెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. కన్నడ భామ అయిన రేఖ వేదవ్యాస్ ఆ తర్వాత వరుసగా కన్నడలో సినిమాలు చేసింది. 2014 నుంచి సినిమాలకు దూరమైన రేఖ ఇటీవల పలు షోలలో కనిపిస్తుంది.

AMB Cinemas : కర్ణాటకలో అతిపెద్ద థియేటర్ ఇప్పుడు మహేష్ బాబుది.. AMB సినిమాస్ త్వరలో బెంగళూరులో..

ఇటీవల తెలుగులో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి వచ్చింది రేఖ. తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా ఈ షోలో రేఖని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సన్నగా అయిపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయి, ఫేస్ కూడా మారిపోయి, చాలా వీక్ గా కనిపించింది. దీంతో రేఖ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటోని, వీడియోని చూసిన జనాలు అసలు ఈమె నిజంగానే రేఖనేనా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమెకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇలా మారిపోయినట్టు సమాచారం. ప్రోమోలో అయితే ఎందుకు ఇలా మారిపోయింది అని చూపించలేదు. ఎపిసోడ్ లో చూపించబోతున్నట్టు ప్రోమోని కట్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. రేఖ ఎందుకు ఇంతలా గుర్తుపట్టలేనంతగా మారిపోయిందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రేక్షకులు.