AMB Cinemas : కర్ణాటకలో అతిపెద్ద థియేటర్ ఇప్పుడు మహేష్ బాబుది.. AMB సినిమాస్ త్వరలో బెంగళూరులో..

ఇన్నాళ్లు టాలీవుడ్ లో రూల్ చేసిన మహేష్ త్వరలో కన్నడ ఇండస్ట్రీలో కూడా అతన బిజినెస్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

AMB Cinemas : కర్ణాటకలో అతిపెద్ద థియేటర్ ఇప్పుడు మహేష్ బాబుది.. AMB సినిమాస్ త్వరలో బెంగళూరులో..

Mahesh Babu AMB Cinemas opening Soon in Bengaluru at Kapali Theater place

Updated On : September 18, 2023 / 7:55 AM IST

AMB Cinemas :  మహేష్ బాబు(Mahesh Babu) సినిమాలతో పాటు యాడ్స్, బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ మల్టిప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఏషియన్ సినిమాస్ తో చేతులు కలిపి AMB సినిమాస్ అని మల్టీప్లెక్స్ హైదరాబాద్(Hyderabad) లో నిర్మించారు. ప్రస్తుతం AMB సినిమాస్ సక్సెస్ ఫుల్ గా ఫుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు మహేష్ మరో AMB మల్టీప్లెక్స్ ని బెంగళూరులో(Bengaluru) ప్రారంభించనున్నారు.

ఇన్నాళ్లు టాలీవుడ్ లో రూల్ చేసిన మహేష్ త్వరలో కన్నడ ఇండస్ట్రీలో కూడా అతన బిజినెస్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. కర్ణాటకలోని అతిపెద్ద థియేటర్ బెంగళూరు గాంధీనగర్ లో ఉన్న కపాలి థియేటర్. ఈ థియేటర్ కట్టి దాదాపు 45 ఏళ్ళు అవుతుంది. 1968లో ఈ కపాలి సినిమా థియేటర్ ని అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ప్రారంభించారు. మొదట 1465 సీట్స్ తో ఉన్న ఈ థియేటర్ ని ఆ తర్వాత 1100 సీట్లకు కుదించారు. కర్ణాటకలో అతిపెద్ద థియేటర్ గా చాలా సంవత్సరాలు చక్రం తిప్పింది ఈ థియేటర్.

Bigg Boss Eliminations : బిగ్‌బాస్‌ లోకి వాళ్ళని తీసుకురావడం ఎందుకు? వాళ్ళిద్దర్నీ మొదట్లోనే పంపించేయడం ఎందుకు?

అయితే ఆ తర్వాత నష్టాలు రావడంతో మెల్లిమెల్లిగా ఈ థియేటర్ క్లోజ్ అయింది. 2017లో ఈ థియేటర్ ని పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఒక మాల్ కడుతున్నారు. ఇందులో మహేష్ బాబు తన AMB సినిమాస్ ప్రారంభించనున్నారు. కనీసం 6 స్క్రీన్స్ ఉంటాయని సమాచారం. అక్కడ కంస్ట్రక్షన్ వర్క్స్ జరుగుతుండగా ఆల్రెడీ AMB సినిమాస్ వస్తుందని బోర్డు కూడా పెట్టారు. వచ్చే సంవత్సరం ఆ మాల్ ప్రారంభమవుతుందని సమాచారం. మహేష్ బాబు స్వయంగా బెంగుళూరులో నిర్మించబోయే AMB సినిమాస్ ని ప్రారంభించడానికి వెళ్తాడని తెలుస్తుంది. దీంతో బెంగుళూరులో కూడా AMB త్వరలో మొదలయి సక్సెస్ గా దూసుకుపోతుందని అభిమానులు, సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నారు.